Advertisement
తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది నటులు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డ స్టార్ డం అనేది రాదు.. కానీ కొంతమంది వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ నటులుగా ఎదుగుతారు.. అలాంటి వారిలో సిల్క్ స్మిత ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే తిరుగులేని నటిగా పేరు సంపాదించుకుంది.
Advertisement
భౌతికంగా దూరమైనా ఆమె నటించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు మత్తెక్కించే అందంతో, కైపెక్కించే కళ్లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
also read; స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పెళ్లి పత్రిక చూశారా?
Advertisement
అప్పట్లో సిల్క్ స్మిత అంటే ఎంత డిమాండ్ వుండేదో మన అందరికీ తెలుసు. సినిమాల్లో అంతటి పేరు సంపాదించిన సిల్క్ స్మిత మాత్రం నిజజీవితంలో అనేక ఇబ్బందులు పడి చివరికి తన కెరియర్ మధ్యలోనే ముగిసిపోయింది. సీతాకోకచిలుక మూవీ ద్వారా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చిన సిల్క్ స్మిత . దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించింది. ఒక్క సంవత్సరంలోనే 45 చిత్రాలకు పైగా నటించి రికార్డు క్రియేట్ చేసింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో మేకప్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న సమయంలో ఒక దర్శకుడు ఆమె అందాన్ని చూసి సినిమాల్లో సైడ్ డాన్సర్ గా అవకాశం ఇచ్చారు.
తర్వాత మత్తెక్కించే కళ్లతో వరుస ఆఫర్లు అందుకుంది. ఇంత పాపులారిటీ సంపాదించుకున్న సిల్క్ స్మిత చివరిరోజుల్లో మాత్రం ఎన్నో కష్టాలు పడి కన్నుమూసింది. మెల్ల మెల్లగా అవకాశాలు తగ్గడంతో నా అనుకునే వాళ్లు మోసం చేయడంతో చివరికి డిప్రెషన్లోకి వెళ్లి ఆర్థిక ఇబ్బందులతో మత్తుకు బానిసై, చివరికి ఒక లెటర్ రాసి ఒక వ్యక్తి మోసం చేశాడని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.
also read;చిరంజీవి అల్లుడా మజాకా సినిమాకు ఎన్టీఆర్ క్లాప్ కొట్టడం వెనుక ఇంత కథ నడిచిందా..!!