Advertisement
ఈ ఆధునిక కాలంలో మానవ జీవితంలో ఫోటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. కరిగే కాలంలో చెదరని మధురస్మృతులకు ప్రతిబింబాలు ఫోటోలు. ప్రతి ముఖ్య సన్నివేశాన్ని కెమెరాలో బంధించి, జీవితకాలం వాటిని పదిలంగా దాచుకొని, అలనాటి జ్ఞాపకాలని మళ్లీ మళ్లీ తనివి తీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇస్తుంది ఫోటో. అయితే ఏ ఫోటో వెనుక ఏ విషాద గాధ దాగి ఉందో చెప్పడం కష్టం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలో అంతులేని శోకం దాగి ఉంది.
Advertisement
Read also: బాలయ్య పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ లెటర్ అందులో ఏముందంటే?
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోటో చూస్తే మీకు ఏమనిపిస్తుంది. బీచ్ లో సాయంత్రం వేళ ఓ జంట ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది కదా..! కానీ ఈ ఫోటో వెనుక తీరని శోకం ఉంది. కన్న కొడుకుని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆవేదన ఉంది. ఈ ఫోటోలో కనిపిస్తుంది భార్య భర్తలు. సాయంత్రం మేళ తమ 19 నెలల కొడుకును తీసుకొని సముద్ర తీరానికి వచ్చారు. ఆ పిల్లాడు అలలతో ముచ్చటపడి ఆడుకుంటుంటే వారు చూస్తూ మురిసిపోతున్నారు. అంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఓ రాకాసి అల.. అలా వచ్చి పిల్లాడిని అమాంతంగా సముద్రంలోకి లాక్కెళ్ళింది.
Advertisement
దాని తర్వాత ఒక్కసారిగా అలల ఉధృతి పెరిగింది. ఆ సమయంలో ఏమీ చేయలేక నిస్సహాయత ఆ తల్లిదండ్రులది. ఆ సందర్భంలో ఆ బాబు తల్లి తన భర్తను పట్టుకుని విలపిస్తున్న సందర్భంలో తీసిన ఫోటో ఇది. ఆ ఘటన జరిగిన మరుసటి రోజున ఆ ప్రదేశానికి కిలోమీటర్ దూరంలో ఆ బాబు శవం కనిపించింది. ఈ ఫోటోని హెర్మోసా బీచ్ లో 1954 ఏప్రిల్ 2న లాస్ట్ ఏంజిల్స్ టైమ్స్ ఫోటోగ్రాఫర్ జాన్ గాండ్ తీశారు. ఈ ఫోటోకు గాను ఆయనకు ఫుల్టీజర్ అవార్డు వచ్చింది. “ట్రజడి బై ద సి” అనే పేరుతో ఈ ఫోటో ఎందరినో ఏడిపించింది.