Advertisement
Jabardasth Comedians: సాధారణంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఏదో విధంగా మంచి గుర్తింపును తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. ఆ క్రమంలోనే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా జబర్దస్త్ షోలో కి రాక ముందు మన కమెడియన్లు ఏం చేసేవారో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికీ ఎప్పటికీ ఈ షో అనేది ఎవర్ గ్రీన్. ఈ షో ద్వారా కమెడియన్స్ ఎంతోమంది పేరు ప్రఖ్యాతలు సంపాదించి సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఈ షో అంతలా విజయవంతం కావడానికి కొందరు కమెడియన్ల కృషి ఎంతో ఉంది. ఆ కమెడియన్స్ ఎవరెవరు..? వారు జబర్దస్త్ కి రాకముందు ఏం చేసేవారో తెలుసుకుందాం..
Advertisement
Read also: పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది.. వాళ్ల పిల్లనే వల్లో పడేసి భార్యగా.. ట్విస్ట్ ఏంటంటే..?
1) హైపర్ ఆది.
హైపర్ ఆది ఒకప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తూ జీవనం సాగించాడు. బీటెక్ పూర్తి చేసిన ఆది దర్శకుడు త్రివిక్రమ్ మరియు సిరివెన్నెల పై పేరడీ చేసి యూట్యూబ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ రావడంతో జబర్దస్త్ టీం లోని టీం లీడర్ అదిరే అభి తో ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు.
2) చమ్మక్ చంద్ర.
Advertisement
ఫ్యామిలీ స్కిట్స్ తో నవ్వించే చమ్మక్ చంద్ర జబర్దస్త్ కి రాకముందు కూలి పని చేసేవారట. ప్రతిరోజు ఏదో ఒక పని చేయకపోతే పూట గడిచేది కాదు. అయితే కొందరు ఆయన టీచర్ గా పని చేశారని అంటున్నారు. జబర్దస్త్ కి వచ్చిన తరువాత ఒక్కో ఎపిసోడ్ కి మూడున్నర లక్షలు తీసుకునే వారట. ఇక ఇప్పుడు మరో కామెడీ షోలోకి వచ్చిన తర్వాత రెమ్యూనరేషన్ మరింత పెరిగిందని తెలుస్తుంది.
3) సుడిగాలి సుధీర్.
సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లోకి రాకముందు రామోజీ ఫిలిం సిటీ లో మెజీషియన్ గా పనిచేసేవారు. దాని ద్వారా నెలకు కేవలం పదివేలు మాత్రమే సంపాదించేవారు. ఇతని పర్ఫామెన్స్ నచ్చి మల్లెమాల ప్రొడక్షన్స్ జబర్దస్త్ లో అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన జీవితమే మారిపోయింది. ఈయన ఇప్పటికి మూడు సినిమాల్లో హీరోగా కూడా నటించారు.
4) అదిరే అభి.
అదిరి అభి గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అలా కొన్ని సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
5) రాకెట్ రాఘవ.
రాకెట్ రాఘవ మొదట సినిమాలలో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసేవారు. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడే పాతుకుపోయారు.