Advertisement
జయలలిత ఎప్పుడూ ఇళయదళపతి విజయ్‌ని శత్రువుగానే చూసేవారు. ఆమె విజయ్ సినిమాలపై రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేసేది. అలాంటి ప్రతిఘటన రహస్యం చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు వెల్లడైంది. విజయ్ కు చిన్న తనం నుంచే హీరో కావాలని ఉండేది. అయితే.. ఇంట్లో తల్లి తండ్రులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కానీ.. విజయ్ మంకు పట్టు పట్టాడు. తండ్రి టాప్ డైరెక్టర్ అయినా.. చదువుకోవాలని సూచించారు. కానీ విజయ్ తానూ హీరోగా ఎదగాలని అనుకున్నాడు. చిన్న తనం లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తండ్రి సినిమాలోనే తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు విజయ్.
Advertisement
సినిమాలపై ఉన్న ఆసక్తిని పెద్ద అవుతున్నా వదల్లేదు. ఓ సారి ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయాడు. థియేటర్లో కూర్చుని ఒకటే సినిమాను నాలుగు షో లు చూసాడు. తండ్రి విజయ్ ను ఎక్కడ ఉన్నదో వెతికి తీసుకొచ్చాడు. మంచి ఆస్తి, ఇల్లు, కారు.. ఎంత కావాలంటే అంత సంపాదిస్తానని విజయ్ చెప్పాడు. తల్లి కోటి సంపాదించు అని అంటే.. పది కోట్లు సంపాదిస్తానని విజయ్ మాటిస్తాడు. ఇక తండ్రి కూడా విజయ్ ను అర్ధం చేసుకుని శిక్షణ ఇచ్చాడు. తన కొడుకుని హీరోగా నిలబెట్టడం కోసం ఇంటిని తాకట్టు పెట్టారు. సిందూర పాండ్య సినిమాను దర్శకుడు, విజయ్ తండ్రి చంద్ర శేఖర్ తీశారు. అందులో విజయ్ కాంత్ పెద రాయుడుగా నటించారు. విజయ్ కూడా ఈ సినిమాలో నటించి బెస్ట్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్నారు.
Advertisement
అయితే జయలలిత విజయ్ ను తొక్కేయడానికి చాల ప్రయత్నాలే చేసారు. విజయ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్లు దొరికేవి కావు. జయలలిత పాలనలో అవినీతి ఎక్కువైందని, డీఎంకే కి ఓటు వేయాలని విజయ్ కామెంట్ చేయడంతో వీరి మధ్య వైరం మరింత ఎక్కువైంది. జయలలిత సీఎంగా ఉంటె విజయ్ సినిమాలను ఆడనిచ్చేది కాదు. ఐదు సంవత్సరాల పాటు దాదాపు 10 విజయ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా విజయ్ బాధ పడలేదు. త్రి ఇడియట్స్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. రజిని తరువాత బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే హీరో అంటే అది విజయ్ నే అనే రేంజ్ కి వచ్చేసాడు. ఇప్పుడు విజయ్ పాలిటిక్స్ లో కూడా అడుగు పెడుతున్నారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత తరువాత ఆ స్థాయిలో పాపులారిటీని విజయ్ సొంతం చేసుకుంటున్నారు.
Read More:
రోజూ “అక్కా అక్కా..” అని పిలిచి మాస్టర్ ప్లాన్ తో టీచర్ ని అనంత లోకాలకి పంపేశాడు.. అసలేం జరిగిందంటే?
అమ్మాయిలు ఎందుకు అమాయకులను దూరం పెట్టి.. చెడ్డవాళ్లకు దగ్గరవుతారు?