Advertisement
Jayam Movie Child Artist Name: నితిన్ మరియు సదా హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ జయం. ఈ సినిమా అప్పట్లో ఎంతో గొప్ప విజయాన్ని అందుకుంది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా సినిమాలోని నటీనటులకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే జయం సినిమాలో సదా చెల్లెలుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు యామిని శ్వేత.
Advertisement
Jayam Movie Child Artist
జయం సినిమా తర్వాత యామిని శ్వేత ఏ సినిమాలోను కనిపించలేదు. ఎన్నో ఆఫర్లు వచ్చిన వదులుకుంది. హీరోయిన్లను తలపించే అందం ఉన్నా కూడా యామినీ శ్వేతా సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారనేది ఇప్పుడు చూద్దాం.
Advertisement
సినిమా ఇండస్ట్రీలో తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి చాలా బాధపడాల్సి వచ్చిందని తల్లి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ బాధలు తన కూతురు పడకూడదని ఆమె తెలిపారు. తన కూతురిని బాలనటిగా చూడాలని ఆశ ఉండేదని, ఆ కోరిక తనకు తీరిందని వెల్లడించారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ నాని సినిమాలు చేసేందుకు, అంగీకరించలేదు అన్నారు. ప్రస్తుతం తన కూతురు పెళ్లి చేసుకుని అమెరికాలో సంతోషంగా ఉందని చెప్పారు.
తన మాటను కూతుర్లు ఎప్పుడూ కాదనలేదని ఇంతకన్నా సంతోషం ఇంకేం కావాలి అన్నారు జయలక్ష్మి. ఇది ఇలా ఉంటే యామిని శ్వేత ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. వివాహం చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చారు కూడా. ఇక యామిని శ్వేతకు విజయవాడలో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. కాగా, అయితే, నటి యామిని శ్వేత నటనకు బ్రేక్ ఇచ్చి సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంది. కాగా, తాజాగా నటి యామిని శ్వేత తన కూతురితో కలిసి దిగినటు వంటి ఫోటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Read Also : బిందెతో ఫోజులిస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?