Advertisement
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. వైద్యులు ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే.. ఆయన హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందని తెలియడంతో నందమూరి కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా బెంగళూరు నారాయణ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఆదివారం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వెళ్లారు. కుటుంబసభ్యులను కలిశారు. డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Advertisement
ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్. ఇప్పడిప్పుడే తారకరత్న కోలుకుంటున్నారని చెప్పారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని అందరం కోరుకుందామని.. ఆయనకు తాతయ్య ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం తారకరత్న స్టేబుల్ గా ఉన్నారని చెప్పిన ఎన్టీఆర్.. ఆరోగ్యం క్రిటికల్ గా లేదని మాత్రం చెప్పలేమని చెప్పారు.
Advertisement
అందరి ప్రార్థనలతో తారకరత్న ఆరోగ్యంగా బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అభిమానుల ప్రత్యేక పూజలతో ఆయన పూర్వస్థితికి వస్తారని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం తరఫున రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సుధాకర్ ఎంతో సహకరించారని తెలిపారు. ఇక కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. అందరి అభిమానంతో తప్పకుండా తమ్ముడు త్వరగా కోలుకుని మన అందరి ముందుకు రావాలని, మీరందరూ ఆ దేవుడిని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
అంతకుముందు మీడియాతో మాట్లాడారు బాలకృష్ణ. తారకరత్న విషయంలో మిరాకిల్ జరిగిందని తెలిపారు. తొలుత హార్ట్ బీట్ ఆగిపోయిందని, కాసేపటి తర్వాత తిరిగి మొదలైందని వివరించారు. కుప్పంలో డాక్టర్లు మెరుగైన వైద్యం అందించారని.. వారి సూచనల మేరకే అత్యాధునిక సదుపాయాలు ఉన్న నారాయణ హృదయాలయకు తీసుకొచ్చామని పేర్కొన్నారు. అభిమానుల దీవెనలతో తారకరత్న త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు బాలకృష్ణ.