Advertisement
చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయమై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించలేదని చాలా మంది ఇంటర్నెట్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ, ఆయన ఎందుకు స్పందించాలని, ఆయనను అవమానించినప్పుడు మీరంతా ఎక్కడకు వెళ్లారు..? అంటూ ఎన్టీఆర్ అభిమానులు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఈ చర్చలు జరుగుతుండగానే.. మరో వైపు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం అటు సిబిఎన్ ఫాలోయర్స్ కు, బాలయ్య బాబు అభిమానులకు షాక్ ఇవ్వనుంది.
Advertisement
ఎన్టీఆర్ శత జయంతి వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందకపోవడం వల్లే ఆయన వెళ్ళలేదు అన్న మాట చాలా చోట్ల వినిపించింది. ఆయనను పిలిస్తే వెళ్లి ఉండేవారని, పిలవకుండా అవమానించారని ఎన్టీఆర్ అభిమానులు కూడా బాధపడ్డారు.
Advertisement
ఇప్పటివరకు ఈ వేడుకలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానులు నిర్వహించేవారు. ఈ ఏడాది మాత్రం రజిని కూడా హాజరు అయ్యారు. ఈ వేడుకల్లో కూడా చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను చూపిస్తూనే ఉన్నారు.
మరోవైపు ఎన్టీఆర్ కాయిన్ ఆవిష్కరణ వేడుకకి కూడా ఎన్టీఆర్ ని పిలవలేదు. చంద్రబాబు నాయుడు కుటుంబం, బాలయ్య తదితరులు మాత్రమే హాజరు అయ్యారు. ఇవి ఇలా ఉంచితే.. తాజాగా తెలంగాణ మంత్రి కుమార్ జిల్లాలో ఎన్టీఆర్ 56 అడుగుల విగ్రహాన్నిఆవిష్కరించబోతున్నారు. ఈ వేడుకలకు ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించారు.
ఈ వేడుకకు వెళ్ళడానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా అంగీకరించారని తెలుస్తోంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఎన్టీఆర్ ని ఆహ్వానించకపోవడం వల్లనే వెళ్లలేదని.. ఇప్పుడు ఇటు చంద్రబాబు నాయుడుకి, అటు బాలయ్య బాబుకి కౌంటర్ ఇచ్చేలా జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.