Advertisement
మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ 2007లో శిరీష్ భరద్వాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్నేళ్ల తర్వాత తన భర్త హెరాస్ చేస్తున్నాడని కేసు పెట్టింది శ్రీజ. ఆ తర్వాత ఆయనతో విడాకులు తీసుకొని 2016లో ప్రైవేట్ సెర్మనీ లో కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకుంది.
Advertisement
అమెరికాలో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీకి చెందిన అబ్బాయి కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకోవడం విశేషం. వీరి పెళ్లి అనంతరం కళ్యాణ్ విజేత మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా తర్వాత నటించిన సినిమా సూపర్ మచ్చి. ఇది ఇలా ఉండగా, కళ్యాణ దేవ్ తాజాగా మరో పోస్ట్ పెట్టాడు.
Advertisement
‘2022 లో చాలా నేర్చుకున్నాను. సహనంగా ఎలా ఉండాలో తెలిసి వచ్చింది. ఎదుగుదల అంటే ఏంటో తెలిసింది. అవకాశాలను అందుకోవడం, రిస్క్ తీసుకోవడం తెలుసుకున్నా. నా తప్పుల నుంచి ఎన్నో నేర్చు కు న్నాను. ఇతరులను క్షమించడం, నాతో నేను ఎక్కువగా గడపడం ఇలా ఎన్నో నేర్చుకున్నాను. నా ఈ ప్రయాణంలో ఉండి, నన్ను నేను మార్చుకునేలా సాయపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రయత్నించడం, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు, మీ అందరికీ ప్రేమ, ఆరోగ్యం, ఆనందం, సాహసం, విజయం మీరు కోరుకునేది ప్రతిదీ ఉండాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు’ అని కళ్యాణ దేవ్ తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చాడు.
Read also: SAMANTHA : సమంత ఆస్తుల విలువ ఎంతంటే..?