Advertisement
Kanuma Subhakankshalu Wishes in Telugu Images, 2024: సంక్రాంతి పండగలో భాగంగా మూడవ రోజు జరుపుకునే పండుగను కనుమ అంటారు. దీనిని పశువుల పండుగగా కూడా చెబుతారు. ఇది వ్యవసాయదారులు, రైతులు పాడి పశువులు ఉన్న వారందరూ జరుపుకునే పండగ. కొత్త అల్లుళ్లకు ఈరోజు మాంసాహారంతో విందును ఇస్తారు. సరదాగా వారితో కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉంటారు. ఈ తరుణంలో కొందరు ఇతరులకు శుభాకాంక్షలు చెప్పాలని అనుకుంటారు. మరి కనుమ శుభాకాంక్షలు ఎలా చెబుతారో తెలుసా? పశువుల కొమ్ములకు రంగులు వేసి అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు వాటికి ఎటువంటి పనులు చెప్పరు. పంటలు పండించడంలో పశువులు ఎంతో సాయం చేశాయని వాటిని ఈరోజు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఇక కొత్త అల్లుళ్లకు ఈరోజు మాంసాహారంతో విందును ఇస్తారు. సరదాగా వారితో కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉంటారు
Advertisement
Kanuma Subhakankshalu Wishes in Telugu Images
- ఇల్లు ధాన్యరాశులతో నిండుగా.. పాడి పంటలతో పచ్చగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కనుమ శుభాకాంక్షలు.
- కష్టానికి ప్రతిపలం కనుమ.. మనలోని మంచితనం వెలిగించే దీపం కనుమ.. మనమందరం కష్టసుఖాలను పంచుకునే పర్వదినం కనుమ..
- రెక్కల కష్టంల చేదోడుగా నిలిచిన పశువులు.. రోకళ్లు దంచే ధాన్యాలు..మనసుల్ని నింపే మాన్యాలు.. అందరికీ కనుమ శుభాకాంక్షలు..
- మట్టిలో పుట్టిన మేలిమి బంగారం.. కష్టం చేతికొ అందొచ్చే తరుణం.. నేలతల్లి, పాడిపశువులు అందించిన వరప్రసాదం.. కనుమ శుభాకాంక్షలు.
- ఈ సంక్రాంతి పండగ ఆనందాలు ఎప్పటికీ నిలవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..!!
- వ్యవసాయంలో తమకు తోడుగా ఉన్న పశువులకు శుభాకాంక్షలు తెలిపే పండుగ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
- ఏడాది పొడవునా తమ కష్టంలో పాలు పంచుకునే పశువులను, రైతన్నలు పూజించే పండుగ కనుమ. తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
- వ్యవసాయంలో తమతో పాటు కష్టించే పశువులను పూజించే పండుగ కనుమ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
- కష్టానికి తగిన ప్రతిఫలం కనుమ, శ్రమకోర్చిన పశువులకు ఇచ్చే గౌరవం కనుమ. మనలోని మంచితనాన్ని వెలిగించే దినం కనుమ. అందరం కలిసి కష్టసుఖాలను పంచుకునే పర్వదినం కనుమ. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ… కనుమ శుభాకాంక్షలు…
- మూడు రోజుల సంబరం ఏడాదంతా జ్ఞాపకం బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకుందాం సంబరం అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
- ముంగిళ్లలో మెరిసే రంగవల్లులు తెలుగుదనాన్ని తట్టిలేపే బంగారు తల్లులు బసవన్నల ఆటపాటలు సంక్రాంతి సరదాలు ఈ ‘కనుమ’ మీకు కమ్మని అనభూతులను అందించాలని కోరుకుంటూ కనుమ శుభాకాంక్షలు
- కష్టానికి తగిన ప్రతిఫలం కనుమ. శ్రమకోర్చిన పశువులకు ఇచ్చే గౌరవం కనుమ. మనలోని మంచితనాన్ని వెలిగించే దినం కనుమ. అందరం కలిసి కష్టసుఖాలను పంచుకునే పర్వదినం కనుమ. మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు!
Happy Kanuma Images in Telugu Text
Advertisement