Advertisement
ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అయితే సంతోషంగా ఉండడానికి వాస్తు ప్రకారం అనుసరించడం మంచిది. వాస్తు ప్రకారం ఇంటి అలంకరణ సానుకూల శక్తుల్ని పెంచడానికి దేవతలతో పాటుగా అనేక విగ్రహాలని ఇంటికి తీసుకురావడం వలన అదృష్టం కలుగుతుంది. ఇది ఇంటి అందాన్ని పెంచడంతో పాటుగా అదృష్టాన్ని కూడా అందిస్తాయి. ఇంట్లో సానుకూలతను పెంచడానికి వాస్తు ప్రకారం కామధేనువు విగ్రహాన్ని ఉంచడం శ్రేయస్కరం.
Advertisement
హిందూమతంలో గోమాతను లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు గోమాతలో సకల దేవతలు ఉంటారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మధురం చేస్తున్న సమయంలో కామధేనువు ఉద్భవించింది. కోరికలు తీర్చే కాంధేనువులో లక్ష్మీదేవి సరస్వతి దుర్గాదేవి ఉంటారు అలాంటి కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. సామరస్య వాతావరణాన్ని పెంపొందించుకోవడానికి అవుతుంది. ఈశాన్య దిశ ఇంటికి అనువైన ప్రదేశం. ఈ ప్రాంతం సంప్రదాయంగా దేవతల కోసం ప్రత్యేకించబడింది. లేదంటే ఈ విగ్రహాన్ని ఇంటి ఉత్తరం లేదా తూర్పు వైపు ఉంచడం వలన ప్రయోజనాలను పొందవచ్చు.
Advertisement
Also read:
ప్రత్యేకంగా పూజ గది ఉన్న ఇళ్లల్లో కామధేనువు విగ్రహాన్ని ఉంచడం మంచిది. వెండితో చేసిన కామధేనువు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సానుకూల శక్తిని అందిస్తుంది. ఇంట్లో ఇత్తడితో చేసిన కామధేనువుని ప్రతిష్టించడం వలన ప్రతికూలత తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఉత్తరం లేదా తూర్పు దిశలో లోహపు తాబేలును ఉంచడం చాలా మంచిది. ధన ప్రవాహా అవకాశాలని ఇది పెంచుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో లోహపు చేపల జతలని ఉంచడం శుభప్రదం. అలాగే హంస జత కూడా ఉండొచ్చు. ఏనుగు ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!