Advertisement
మునుగోడు ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయం సాధించింది. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 95,028 ఓట్లతో ఈ ఎన్నికల్లో విజయభేరి మోగించారు. బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై దాదాపు 10వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 95,028 ఓట్లు సాధించగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 85,128 ఓట్లు సాధించారు. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. మొదటి 3 రౌండ్లలో చౌటుప్పల్ మండలం ఓట్లు, తర్వాతి మూడు రౌండ్లలో నారాయణపురం మండలం ఓట్లు, తర్వాతి రెండు రౌండ్లలో మునుగోడు మండలం ఓట్లు, 9, 10 చండూరు, 11, 12, 13, 14, 15 రౌండ్లలో మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కించారు.
Advertisement
మొదటి నాలుగు రౌండ్ల వరకు టీఆర్ఎస్, బిజెపి అభ్యర్థుల మధ్య గట్టి పోటాపోటీ నడిచింది. ఆ తర్వాత ఆరవ రౌండ్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి స్పష్టమైన మెజార్టీ సాధిస్తూనే వచ్చారు. మొత్తం 15 రౌండ్లలో టిఆర్ఎస్ అభ్యర్థి ఎక్కువసార్లు తన ఆధిక్యతను ప్రదర్శించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 23 వేల ఓట్లకు మాత్రమే పరిమితం అయింది. అయితే మునుగోడులో బిజెపి పార్టీ ఓడిపోవడంతో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. ఎన్నిక ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
Advertisement
మునుగోడులో కేసీఆర్ పార్టీ విజయం సాధిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఎన్నికలకు ముందు రాజగోపాల్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. అయితే దానికి సంబంధించిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అయితే రాజకీయ సన్యాసంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా స్పందించలేదు. కేవలం మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు చేసి వెళ్లిపోయారు రాజగోపాల్ రెడ్డి. తన రాజకీయ సన్యాసంపై రేపు లేదా మరో రెండు రోజుల తర్వాత ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇక అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చాలా అఘోమ్యాచారంగా ఉంది. తన తమ్మునికి ఓటెయ్యాలంటూ, వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇంకా చెరిగిపోలేదు. వాటిపై సమాధానం చెప్పే వరకు కాంగ్రెస్ పార్టీలోకి ఆయనను అస్సలు రానివ్వరు. ఒకవేళ అధిష్టానం రమ్మని రాష్ట్ర నాయకులు ఆయనను అసలు దగ్గరికి రానివ్వరు. దీంతో ఆయన కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటారని నల్గొండలో ప్రచారం జోరుగా సాగుతోంది.
READ ALSO : కమలానికి గుచ్చుకున్న గులాబీ ముల్లు
రాజకీయ సన్యాసం తీసుకోనున్న @krg_reddy #MunugodeBypoll pic.twitter.com/5Vsm6CxUwB
— BRS News (@BRSParty_News) November 6, 2022