Advertisement
నిహారిక కొణిదెల ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. నిత్యం తన హాట్ హాట్ ఫోటోలను నెట్ లో షేర్ చేస్తూ తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. కొంతకాలం క్రితమే నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరు విడాకులు తీసుకోవడానికి ముందే వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ మీడియా కోడై కూసింది. ఆ వార్తలే నిజం అయ్యాయి. వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు గడుపుతున్నారు.
Advertisement
అయితే గతంలో నిహారిక విడాకులు తీసుకోబోతోందని వార్తలు వచ్చిన వెంటనే నిహారిక తన జీవితాన్ని తన చేతులతో నాశనం చేసుకుంటుందని, ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తకు అన్యాయం చేసిందని మీడియాలో పలు వార్తలు వినిపించాయి. ఓ యుట్యూబర్ తో ఆమె సంబంధం పెట్టుకుందన్న వార్తలు చాలానే వచ్చాయి. ఆ యూట్యూబర్ పేరు కూడా బయటపెట్టి నిహారికను ట్రోల్ చేశారు. అంతేకాకుండా, నిహారిక తన భర్త నుండి విడాకులు తీసుకున్న వెంటనే యూట్యూబర్‌ను వివాహం చేసుకుంటుందని మరియు ఇప్పుడు వారు రిలేషన్షిప్లో ఉన్నారని టాలీవుడ్లో అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి.
Advertisement
నిహారిక తన సోషల్ మీడియా ఖాతాలో యూట్యూబర్ అయిన నిఖిల్ విజయేంద్ర (నిఖిల్ విజయేంద్ర)తో ఫోటోలను పంచుకుంటూ, ఆమె అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఒక్క పోస్ట్ తో తన పెళ్లి గురించి అందరికి క్లారిటీ ఇచ్చింది. ఈ పోస్ట్ లో నిఖిల్ ను ఆమె తన సోదరుడిగా పిలిచింది. దీనితో వీరిద్దరి మధ్య సోదర సోదరీ సంబంధం మాత్రమే ఉందని అందరికి అర్ధం అయ్యింది.