Advertisement
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి. ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేసి నెల రోజులు పైనే కావొస్తోంది. అయితే.. ఆయన అరెస్ట్ ను టీడీపీ నేతలే కాదు ప్రజల్లో కూడా చాలా మంది వ్యతిరేకించారు. అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ కు చెందిన ఆంధ్ర సెటిలర్స్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై తమ వ్యతిరేకతను వ్యక్తం చేసారు.
Advertisement
అయితే రోజులు గడుస్తున్నా.. చంద్రబాబు నాయుడు రిలీజ్ కాకపోవడంపై వీరిలో అసహనం ఎక్కువ అవుతోంది. దీనితో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై నిరసన చేయడం చేసారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఖండిస్తుందని కేటీఆర్ గట్టిగానే చెప్పారు. ఇక్కడ లేని పంచాయితీ గురించి ఎందుకు అంటూ కఠినంగానే ప్రశ్నించారు. కేటీఆర్ ఇలా స్పందించడం పట్ల కూడా అసంతృప్తులు వ్యక్తం అయ్యాయి.
Advertisement
ఇటీవల ఈ విషయమై కేటీఆర్ మరోసారి స్పందించారు. చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలుపుకునే వ్యక్తులు ధర్నాలు చేసుకోవచ్చని అన్నారు. కానీ, అందుకోసం ధర్నా చౌక్ ఉందని.. ఎక్కడ బడితే అక్కడ ధర్నాలు చేసి ఇతర ప్రజల, ప్రయాణీకుల శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసారు. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా నాకు దగ్గరి వారే. అలాగే పవన్, జగన్ కూడా నాకు కావాల్సిన వారే. ఎవరి మీద శత్రుత్వం లేదు అంటూ కేటీఆర్ తెలిపారు. అయితే.. నిరసనలు తెలపాలనుకుంటే ధర్నా చౌక్ లో చేసుకోవాలని.. మెట్రో రైల్స్ లో, ప్రజల క్షేమానికి ఇబ్బంది అయ్యే విధంగా చేయవద్దని తెలిపారు.
మరిన్ని..
Renudesai: రేణుదేశాయ్ లైఫ్ పెళ్ళికి ముందు కూడా దారుణమేనా? పేరెంట్స్ మరీ ఇలా ఉన్నారా?