Advertisement
ఒక బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే పెద్ద ఎత్తున పారితోషకం ఇచ్చి, పెద్ద సెలబ్రిటీలను ఎంపిక చేసుకొని వారి చేత తమ బ్రాండ్లకు ప్రమోట్ చేయించుకుంటూ ఉంటారు. ఇక పోతే లలిత జ్యువెలర్స్ ఓనర్ కిరణ్ కుమార్ మాత్రం తన జువెలర్స్ కి తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఇక ఈయన తన జ్యువెలరీ షాప్ కోసం చేసుకున్న యాడ్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే హైదరాబాదులో మూడు షోరూమ్లు ఓపెన్ చేయగా, తోలుతా సోమాజిగూడలో, ఆ తర్వాత కూకట్ పల్లి, తదనంతరం దిల్ సుక్ నగర్ షోరూం లను ప్రారంభించారు.
Advertisement
అత్యంత త్వరలోనే చందానగర్, సుచిత్ర సర్కిల్ వద్ద షోరూం లను ఓపెన్ చేయనున్నట్టు కిరణ్ చెబుతున్నారు. నిజామాబాద్ లో కూడా ఓ షోరూం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో లలిత జ్యువెలరీకి లలిత అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని ప్రశ్నించగా, అందుకు సమాధానం కిరణ్ ఇలా చెప్పారు. 1999 లో లలిత జ్యువెలరీని నేను టేక్ ఓవర్ చేశానని, నేను ఒరిజినల్ ఓనర్ ని కాదు. కందు స్వామి అనే అతను ఒరిజినల్ ఓనర్. అతని వద్ద నుంచి తాను టేకోవర్ చేసినట్టు చెప్పుకొచ్చారు.
Advertisement
మరోవైపు లలిత జ్యువెలరీస్ అనగా జయలలిత సంబంధించినవని అప్పట్లో రూమర్స్ వినిపించేవి దానిపై మీరు ఏమంటారు అని ప్రశ్నించగా, ఎవరు ఏమైనా అనుకోని నాకు సంబంధం లేదని పేర్కొన్నారు. సోనియా అంటే సోనియా గాంధీది అనేవారు. మోడీ జువెలరీస్ అంటే నరేంద్ర మోడీ అని అనుకునేవారు. అసలు పొలిటీషన్స్ కి మనకు సంబంధమే లేదు. తాను ఫస్ట్ షో రూమ్ ఆంధ్ర నుంచి మొదలు పెట్టానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 42 షో రూమ్లు ఉన్నాయి. త్వరలో 120 షోరూంలను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాను. అదేవిధంగా ఉత్తర భారత దేశంలో కూడా షోరూమ్లను ప్రారంభించాలనుకుంటు న్నాం. భారతదేశం అంతట 450 షో రూమ్లను ఏర్పాటు చేయాలనే ప్లాన్ ఉంది. నాలుగైదు సంవత్సరాల్లో అది పూర్తి చేస్తానని చెప్పుకొచ్చారు కిరణ్ కుమార్.
READ ALSO : చంద్రముఖి అసలు కథ ఇదే.. సినిమా కి వాస్తవానికి తేడా ఇంత వెరిషన్ ఉందా ?