Advertisement
మెహర్ రమేష్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మెహర్ రమేష్ హాట్ టాపిక్ అవుతున్నారు. టాలెంట్ ఉన్న డైరెక్టర్లు కథ చెప్తేనే పెద్ద హీరోలు సినిమా చేయడానికి ఒప్పుకోవడం లేదు కానీ విచిత్రం ఏంటంటే భారీ డిజాస్టర్లు ఇస్తున్న మెహర్ రమేష్ సినిమాలను కూడా హీరోలు ఒప్పుకుంటున్నారు. మెహర్ రమేష్ సినిమాలు గురించి మొదలుపెడితే అన్ని మైనస్ పాయింట్స్ ఏ ఉంటున్నాయి. అయితే మెహర్ రమేష్ ప్లాప్స్ కి వరల్డ్ కప్ కి ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
Advertisement
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అవుతుంది 2011లో శక్తి సినిమా రిలీజ్ అయింది డిజాస్టర్ గా నిలిచింది. అదే సంవత్సరం మన దేశం వరల్డ్ కప్ ని సాధించింది. 2013లో మెహర్ రమేష్ షాడో సినిమా చేశారు. అది డిజాస్టర్ అయింది. ఛాంపియన్ ట్రోఫీని మన దేశం సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు భోళా శంకర్ డిజాస్టర్ గా నిలిచింది.
Advertisement
ఈ ఏడాది వరల్డ్ కప్ ని భారత్ ఈ లెక్కన గెల్చుకుంటుందని క్రికెట్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. మరి సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ వస్తుందో లేదో చూడాలి భోళా శంకర్ గురించి నెగటివ్ ప్రచారం జరుగుతున్నా మహర్ రమేష్ మాత్రం ఎటువంటి మాట మాట్లాడలేదు. కనీసం దాని గురించి స్పందించలేదు. ఏది ఏమైనా చిరంజీవి సినిమాని ఒప్పుకుని తప్పు చేసారు. ఫ్యాన్స్ కూడా రీమేక్ సినిమాలు చేయొద్దు అన్న అంటున్నారు మరి ఇకనైనా చిరంజీవి రీమేక్ సినిమాలని చేయడం మానేస్తారో లేదో చూడాలి.
Also read: