Advertisement
ప్రపంచవ్యాప్తంగా సోమవారం సూర్యగ్రహణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈ గ్రహణం పాక్షికంగా ఉంది. సాయంత్రం నాలుగు గంటల 59 నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం, సాయంత్రం 5 గంటల 45 నిమిషాల వరకు కొనసాగింది. దేశంలో సాయంత్రం 5 గంటల ఒక నిమిషం నుంచి 6 గంటల 26 నిమిషాల దాకా ఆగ్రహణం ఏర్పడింది. గ్రహణం ఏర్పడుతుందని తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం, యాదాద్రి నరసింహస్వామి ఆలయం, వేములవాడ రాజన్న ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయం మూసివేశారు.
Advertisement
ఇక ఇది జరిగిన సరిగ్గా 15 రోజుల తర్వాత అంటే, నవంబర్ 8న ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం కూడా ఏర్పడుతోంది. అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీకమాసం పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది. ఇది భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అయితే భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం 5:30 గంటలకు ప్రారంభమై 6:19 వరకు ఉంటుంది. దాదాపు గంటన్నర పాటు కొనసాగనున్న ఈ గ్రహణం భారత్ తో పాటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర ఫసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో కనిపించనుంది.
Advertisement
ఇది ఇలా ఉంటే, జ్యోతిష్యుల ప్రకారం 15 రోజుల్లో రెండు గ్రహణాలు సంభవించడం అశుభ ఫలితాలను తెస్తుంది. అంటే 15 రోజుల వ్యవధిలో వచ్చే రెండు గ్రహణాలు ప్రపంచం పై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించవచ్చని అంటున్నారు. లేదంటే, వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చని చెబుతున్నారు. దీంతో దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తవచ్చు, అభివృద్ధి వేగం మందగిస్తుంది. వ్యాపార తరగతి ప్రజలలో ఆందోళన పెరుగుతుందని జ్యోతిశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
READ ALSO : Google : గూగుల్ కు మరో షాక్, భారీ జరిమానా విధింపు!