Advertisement
Gunturu Kaaram Songs Kurchi Madtha Petti: మహేష్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ “గుంటూరు కారం”. చాలా నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే అనుకోని సమస్యల కారణంగా ఈ సినిమా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవలే.. ఈ సినిమా పనులు కొంత వేగం పుంజుకున్నాయని చెప్పచ్చు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ధమ్ మసాలా సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా శ్రీలీల నటిస్తున్నారు.
Advertisement
వీరిద్దరి జోడీ కూడా బాగా కుదిరింది అని అంతా అనుకున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి రెండవ సారి రిలీజ్ అయినా ఓ మై బేబీ పాట మాత్రం చాలా నిరాశ పరిచింది. అయితే.. ప్రేక్షకులు మూడవసారి మంచి మాస్ మసాలా సాంగ్ కోసం ఎదురు చూస్తున్న టైం లోనే “కుర్చీ మడత పెట్టి” సాంగ్ ను అనౌన్స్ చేసారు. పూర్తి సాంగ్ ఇంకా విడుదల కాకుండానే.. ఈ పాటపై అప్పుడే ట్రోలింగ్ మొదలైపోయింది.
Advertisement
మహేష్ బాబు లాంటి హీరోతో ఎలాంటి స్టెప్పులు వేయిస్తున్నారు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తమన్ ఈ పాటకి గట్టి బీట్ నే ఇచ్చాడు. మహేష్ ఫ్యాన్స్ ని ఆకట్టుకోవాలని అనుకున్నాడు. కానీ, డాన్స్ వద్ద గందరగోళం నెలకొన్నట్లయింది. శ్రీలీల కు మహేష్ కు మధ్య వచ్చిన మాస్ స్టెప్స్ ఎబ్బెట్టుగా అనిపించాయి. “కుర్చీ మడతపెట్టి” అనే లైన్ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. అందుకే ఆ లైన్ ని పాటలో వాడారని తెలుస్తోంది. అయితే.. ఈ పాట కి డీజే ఆల్రెడీ వచ్చేసింది. ఇక తమన్ ఇచ్చిన బీట్ కూడా అలానే ఉండడంతో.. కావాలనే కాపీ చేశారా? అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి.
Read More:
Devil Movie Review: కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా కథ, రివ్యూ అండ్ రేటింగ్…!
డిసెంబర్‌లోనే ముగ్గురు తమిళ దిగ్గజ నటులు చనిపోయారు… ఇదేం శాపమో…!
Vijayakanth: విజయ్ కాంత్ ది తెలుగోడి రక్తమే.. అప్పట్లో ఏం జరిగిందో తెలుసా..?