Advertisement
సాధారణంగా వివాహం విషయంలో చాలా మంది వారి దగ్గర బంధువులనే పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మేనరికపు పెళ్లిల్లు అనేవి మనకు పూర్వకాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం.. చాలామంది వారి మేన మరదలు, లేదంటే మేనకోడలిని పెళ్లి చేసుకుంటూ వుంటారు.. ఈ పెళ్లి విషయంలో కొంతమంది ఆనందంగా ఉంటే మరి కొంత మంది మాత్రం, మేనరికం పెళ్లికి చాలా దూరంగా ఉంటూ భయపడుతున్నారు. మరి అలా ఎందుకు భయపడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది ఓ సారి చూద్దాం..
Advertisement
also read:ఆ నటుడితో భార్యగా, చెల్లిగా, కూతురుగా నటించిన రమ్యకృష్ణ..ఆయన ఎవరో తెలుసా..?
Advertisement
మేనరికం పెళ్లిలో ఎక్కువగా పుట్టబోయే బిడ్డకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అంగవైకల్యం, వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంటుంది.. దీనికి ప్రధాన కారణం పుట్టబోయే బిడ్డకు తల్లి నుంచి 23 క్రోమోజోములు, తండ్రి నుంచి 23 క్రోమోజోములు వస్తాయని నిపుణులు అంటున్నారు.. ఈ విధంగా వచ్చే క్రోమోజోములు తల్లిదండ్రుల నుండి వారికి కలిగే సంతానానికి కీలక అంశాలపై సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాయని సైన్స్ చెబుతోంది.. అయితే పెళ్లి చేసుకునే వారు రక్త సంబంధీకులు కాకుంటే బిడ్డకు ఒక సమాచారాన్ని చేరవేసే ఒక జన్యువు తండ్రిలో లోపభూయిష్టంగా ఉంటే..
తల్లి నుండి మంచి జన్యువుతో ఆ లోపం భర్తీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా తల్లిలో లోపభూయిష్టమైన తరహా జన్యువు ఉంటే, తన తండ్రి నుంచి వచ్చే జన్యువు ప్రభావితం చేసి పుట్టబోయే బిడ్డలో ఎలాంటి లోపం రాకుండా చూసే అవకాశం ఉంటుంది.. అంతేకాకుండా ఇద్దరు దంపతులు ఒకే కుటుంబానికి చెందిన వారైతే ఇద్దరు జన్యువులలో లోపం ఉంటే మాత్రం దాన్ని సరి చేసే జన్యువు ఏది కూడా లేకపోవడంతో, వీరికి జన్యుపరమైన లోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైన్స్ చెబుతోంది.
also read: