Advertisement
ఇండో-ఫ్రెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో తొమ్మిది అవార్డులను గెలుచుకున్న సినిమా “మట్టి కథ”.. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం గెల్చుకుంది. ఈ సినిమా ఆహ ఓటిటి లో ప్రసారం కాబోతోంది. ఈ చిత్రం అక్టోబర్ 13 నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాలో అజేయ్ వేద్, మాయ, కనకవ్వ, దయానంద్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బల్వీర్ సింగ్, అక్షయ్ సాయి, రాజు ఆలూరి, రుచిత మరియు బత్తుల తేజ తదితరులు నటించారు. మట్టి కథకు పవన్ కడియాల రచన మరియు దర్శకత్వం వహించారు.
Advertisement
తెలంగాణలోని పల్లెటూరి నేపథ్యంలో సాగే మట్టి కథ భూమయ్య (అజయ్ వేద్), శ్రీను (అక్షయ్ సాయి), యాదగిరి (రాజు ఆలూరి), రాజు (బత్తుల తేజ) అనే నలుగురు కాలేజీ స్నేహితుల కథ. ముఠాలోని మిగతా ముగ్గురూ తమ జీవితాలతో సంతోషంగా ఉండగా, భూమయ్యకు ఇంకేదో కావాలి. అతను కూడా రాజి (మాయ)తో ప్రేమలో ఉంటాడు. మట్టి కథ, టైటిల్ పాక్షికంగా సూచించినట్లుగా, వారి గ్రామంలోని భూ ఆక్రమణల సమస్యను కూడా పరిశీలిస్తుంది. చిత్రం యొక్క ముఖ్యాంశం భూమయ్య చుట్టూ తిరుగుతుంది. అతని జీవితంలోని ఓ సంఘటన ప్రపంచాన్నే కదిలిస్తుంది.
Advertisement
అతను తీసుకున్న నిర్ణయాలతో అతని తలరాతే మారిపోతుంది. అసలు అతని జీవితంలో ఏమి జరిగింది? ఆ సమస్యల్ని వారు ఎలా ఎదుర్కొన్నారు అన్న కథాంశమే ఈ సినిమా. ఇందులోని నటీనటుల పాత్రలు అన్ని చక్కగా కుదిరాయి. అవి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే విధంగానే ఉన్నాయి. ఎమోషనల్ కంటెంట్ తో సాగే ఈ సినిమాలో చివరి వరకు గ్రిప్పింగ్ ని కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. స్ట్రాంగ్ ఎమోషన్స్ తో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 13 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అస్సలు మిస్ కాకుండా చూసేయండి.
మరిన్ని..
కంటిచూపుతో అందరిని భయపెట్టే బాలయ్య కూడా ఆ వ్యక్తికి భయపడతారా? ఇంతకీ ఎవరంటే?
పవన్ చెయ్యలేని ఆ పనిని ఎన్టీఆర్ చేసి చూపించారు..! అదేంటంటే?
సిబిఎన్ ను జైల్లోనే ఉంచేసి.. రోడ్లపై ప్రచారం చేయనున్న వైసీపీ? ఎన్నికల వ్యూహం అదేనా?