Advertisement
మేరకు ఎమర్జెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు, ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించడానికి అవసరమైతే కనుక హెలికాప్టర్ ను వినియోగిస్తామని చెప్పడం జరిగింది. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్య అధికారులతో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించినట్లు చెప్పారు. వైద్య సేవలను అంతరాయం లేకుండా అందించాలని సూచించారు. స్టేట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Advertisement
Advertisement
108 102 వాహన సేవలు పూర్తిస్థాయిలో వినియోగించాలని తెలిపారు. గర్భిణీలకు, డయాలసిస్ పేషంట్లకి అవసరమైన వైద్య సేవలు అందేలా చూడాలని కూడా హరీష్ రావు కోరారు. ఆహార నాణ్యత పై దృష్టి పెట్టాలని మెడికల్ ఆఫీసర్లు వాళ్ల పరిధిలో ఉండే అన్ని రకాల ప్రభుత్వ హాస్టలను కూడా సందర్శించాలని చెప్పారు హరీష్ రావు. ఆసుపత్రి వార్డుల్లో కూడా శుభ్రత పాటించాలని, శుభ్రత ఉండేలా సూపరిండెంట్లు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. పాము కాటు తేలు కాటు మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోమని హరీష్ రావు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు చెప్పారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని కూడా హరీష్ రావు చెప్పారు.
Also read: