Advertisement
ఎప్పటినుండో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న బ్రో సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ ఇద్దరూ కలిసి మొదటిసారి ఒక సినిమాలో కనపడుతున్నారు. ఈ సినిమాకి థమన్ అందించిన బీజీఎమ్ చాలా బాగుందని ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. ప్రతి సినిమాలో కూడా మైనస్ పాయింట్ లో ఉన్నట్లే ఈ సినిమాలో కూడా కొన్ని మైనస్ పాయింట్ లు ఉన్నాయి. మరి ఇక అవేమిటో చూసేద్దాం.
Advertisement
Advertisement
- సాంగ్స్ లో మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. బిజిఎం బాగున్నా సాంగ్స్ మాత్రం డిసప్పాయింట్ చేసాయి.
- సినిమాలో మూవీ మేకర్స్ పొలిటికల్ డైలాగ్స్ ని పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
- కొన్ని సీన్లలో పవన్ కళ్యాణ్ హిట్ పాటలతో చేసిన ప్రయోగం మాత్రం డిసప్పాయింట్ చేసింది. అనుకున్నట్లుగా కుదరలేదు.
- కథ మొత్తం బాగున్నా కూడా కథనం విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఒరిజినల్ కథలో ఉన్న మంచి ఫిల్ ని సినిమాలో మిస్ చేశారు.
- కొన్ని అనవసరమైన సీన్లు ఈ సినిమాలో పెట్టడం కూడా సినిమాకి మైనస్ అయింది.
- కామెడీ మాత్రం సినిమాలో చాలా బాగుందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించాయట. చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మాత్రం ఈ సినిమా అసలు నిరాశపరచదు.
Also read: