Advertisement
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ఆది పురుష. ఆది పురుష్ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో రామయ్యగా ప్రభాస్ సీతమ్మగా కృతి సనన్ నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆది పురుష్ సినిమా పేరు వినపడుతోంది. జూన్ 16న థియేటర్లో ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అయింది. ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చి ఫైనల్ గా జూన్ 16న రిలీజ్ అయింది.
Advertisement
ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం అది పురుష్ ట్రోలింగ్ జరుగుతోంది. సినిమాలో తప్పుల్ని ఎంచి ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు. ఒక ఫేస్బుక్ యూజర్ అయితే ఈ సినిమాలో ఎన్ని తప్పులు తీసారు అనేది చెప్పుకొచ్చారు. అసలు రామాయణాన్ని చదివే ఈ సినిమాని తీశారా అంటూ సోషల్ మీడియా యూజర్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మరి ఇక ఈ సినిమాలో ఎలాంటి తప్పులని చేసారు అనేది తెలుసుకుందాం.
ఈ సినిమాలో రాముడు చూస్తుండగానే సీతమ్మని ఎత్తుకు వెళ్ళిపోవడానికి చూపించారు. అసలు నిజంగా ఇలా జరగలేదు కదా.. ఇంత పెద్ద తప్పును ఎవరైనా ఊరుకుంటారా..? అదే కాకుండా కుంభకర్ణుడి చేత ఆంజనేయుడిని కొట్టించడం కూడా ఈ సినిమాలో పెట్టారు. ఇది కూడా మరో తప్పు. ఇలా చాలా తప్పులు ఉన్నాయి వాటిని కూడా ఇప్పుడే చూసేయండి.
Advertisement
- రాముడు వీరుడు. కుంభకర్ణుడు తెలియకుండా బాణం ని వేసి చంపినట్టు ఇందులో చూపించారు.
- సీతమ్మ ఎప్పుడు రావణుడిని కంటితో చూడనే చూడదు. కేవలం గడ్డిపోచని చూసి మాట్లాడుతుంది.
- అలానే ఈ సినిమాలో మహాసాధ్వి మండోదరిని విధవగా చూపించారు.
- మీసాలు రాముడికి ఉండడం తప్పు కాదు కానీ గడ్డాలు ఉన్నాయి. రాముడు నీలమేఘశ్యాముడు. ఆ వర్ణాన్ని అస్సలు చూపించేలేదు.
- వాల్మీకి రామాయణంలో సీత లక్ష్మణుడిని శంకిస్తుంది. అయితే లక్ష్మణ రేఖ మాత్రం అబద్ధం. ఓం రౌత్ ఈ నిజాన్ని వదిలేసారు.
- లంక స్వర్ణ లోకం. కుబేరుడిని బెదిరించి రావణుడు లాక్కున్నాడు. అయితే భూత్ బంగళాలా లంకని చూపించారు.
సీతమ్మ వస్త్రధారణ. - ఆడవారి ముఖాన బొట్టు లేదు. శివభక్తులకు శివనామాలు లేవు.
Also read:
దిల్ సినిమాలో నటించిన ఈ 5 నటులు.. చనిపోయారని మీకు తెలుసా..?
ఒకే కామన్ పాయింట్ తో కళ్యాణ్ రామ్ కి నాలుగు హిట్లు.. మీరు గమనించారా..?