Advertisement
టాలీవుడ్ ప్రముఖులు సిరివెన్నెల సీతారామశాస్త్రి గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించి ఇన్ని రోజులు అయినా ఆయన జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. ఈ తరుణంలోనే టాలీవుడ్ నటుడు మోహన్ బాబు సిరివెన్నెల సీతారామశాస్త్రి పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయం సందర్శనార్థం మోహన్ బాబు ఫ్యామిలీ వెళ్లలేదు. ఎందుకంటే మోహన్ బాబు సొంత తమ్ముడు మరణించడంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. అయితే తాజాగా ‘రుద్రంకోట’ సినిమా కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు సిరివెన్నెల గురించి భావద్వేగానికి గురయ్యారు.
Advertisement
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!
‘సిరివెన్నెల గారి మరణంతో ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయింది. ఇంట్లో జరిగిన సంఘటనల వల్ల అక్కడికి వెళ్లలేకపోయాం. అందుకే సిరివెన్నెలను చూడటానికి ఎవరిని వెళ్లకూడదు అని ఆదేశించా. కానీ ఆయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయనను ఇండస్ట్రీ మరిచిపోయిన ఆయన రాసిన పాటలు ముందు ముందు కూడా వింటారు. పరిశ్రమలో వరుసగా విషాద సంఘటనలు చోటు చేసుకోవడం నన్ను ఎంతో బాధకు గురి చేస్తోంది’ అని అన్నారు.
Advertisement
రుద్రం కోట సినిమాపై మోహన్ బాబు ఈ సందర్భంగా మాట్లాడారు. ‘చిన్న సినిమాలే ఇండస్ట్రీని కాపాడుతాయని మా గురువుగారు చెప్పారు. ప్రతి ఒక్కరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వస్తారు. అలాగే కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్ అని ఎవరు ఫీల్ కావద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మొదటి సినిమా కొత్తగానే ఉంటుంది. మేము కూడా కొత్తగా పరిశ్రమ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత ఇండస్ట్రీలో స్థిరపడ్డాం. అందువల్ల కొత్త అని ఫీల్ కాకుండా మంచి సినిమాలు తీయాలి. అప్పుడే పైకి ఎదుగుతారు’. అని మోహన్ బాబు అన్నారు.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?