Advertisement
ఇండస్ట్రీలో నటకిరీటిగా పేరు ప్రఖ్యాతల్ని తెచ్చుకున్నారు రాజేంద్రప్రసాద్. కామెడీ సినిమాలకు ఆయనకు పెట్టింది పేరు. రాజేంద్రప్రసాద్ చాలా కాలం పాటు కామెడీ సినిమాలు చేసారు. అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నారు. అందులో భాగంగా ఆయన సినిమాలు కోసం యావత్ తెలుగు ప్రేక్షకులందరూ ఎదురు చూసేవారు. అలాంటి రాజేంద్రప్రసాద్ సంవత్సరం నుంచి తన మార్కెట్ ని కోల్పోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి స్టార్ హీరోలు అందరి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.
Advertisement
సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన నాన్నకు ప్రేమతో సినిమా భారీ విజయాన్ని అందించింది. ఎన్టీఆర్ కి ఆ సినిమా విపరీతమైన క్రేజ్ ని తీసుకువచ్చింది ఎన్టీఆర్ లుక్స్ అయితే చాలా స్టైలిష్ గా ఉంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ చనిపోయే ఒక సీన్ ఉంటుంది దీని మీద రీసెంట్గా రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నాన్నకు ప్రేమతో మూవీలో తను చనిపోయే సమయానికి చాలా నవ్వుతూ కళ్ళు మూస్తాడు.
Advertisement
Also read:
Also read:
సినిమా షూటింగ్ సమయంలో చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిన ఎన్టీఆర్ కొద్దిసేపటి వరకు ఏడుస్తూనే ఉన్నారట. ఎంతమంది వచ్చి ఓదార్చినా కూడా ఏడుపు ఆపలేదట. దానికి కారణం ఏంటి అంటే రాజేంద్ర ప్రసాద్ కి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంట్ అని చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ వలన ఎన్టీఆర్ తన క్యారెక్టర్ మరణించినప్పుడు రియల్ గా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారని రాజేంద్రప్రసాద్ చెప్పుకోచ్చారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!