Advertisement
Devara Review and Rating: ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, శృతి మరాఠే, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ మూవీలో నటించారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా.. మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
Advertisement
సినిమా: దేవర
నటీనటులు: ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, శృతి మరాఠే, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు.
దర్శకుడు: కొరటాల శివ
నిర్మాత: మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
రిలీజ్ డేట్: 27-09-2024
కథ మరియు వివరణ:
ఎర్ర సముద్రం ప్రాంతంలో నాలుగు ఊర్లు ఉంటాయి. ఓ ఊరికి అండగా దేవర (ఎన్టీఆర్) ఉంటాడు. మరో ఊరికి భైర (సైఫ్ అలీ ఖాన్) పెద్దగా ఉంటాడు. మిగిలిన రెండు గ్రామాల వాళ్లతో కలిసి దేవర, భైర సముద్రం పై వచ్చే షిప్ లో దోపిడీలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వచ్చే కొన్ని పరిణామాలు నేపథ్యంలో భైర, దేవర మధ్య గొడవ జరుగుతుంది. అసలు దేవర దేనికి వాళ్లకు వ్యతిరేకంగా మారాడు..? దేవర ఎవరికి కనపడకుండా పోవడానికి కారణం ఏంటి..? దేవర కొడుకు వర ఎందుకు భయపడుతూ ఉంటాడు. వరతో, తంగం ప్రేమ కథ ఎలా సాగింది చివరకు దేవర కథ ఎలా ముగుస్తుంది..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి.
Advertisement
ఎన్టీఆర్ చాలా అద్భుతంగా ద్విపాత్రాభినయంలో నటించారు. తారక్ అభినయం సినిమాకు పెద్ద హైలైట్ అయ్యింది. ఎన్టీఆర్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో అలాంటి భారీ విజువల్స్ తో సినిమా వచ్చింది పైగా వాటికి తగ్గట్టుగా డిఫరెంట్ వేరియేషన్స్ ని చూపిస్తూ తన పవర్ఫుల్ పర్ఫామెన్స్ తో ఎన్టీఆర్ ప్రేక్షకుల్ని ఫిదా చేసేసారు. దేవరలో తెలుగు తెరపై పరిచయమైన జాన్వి కపూర్ తంగం పాత్రలో బాగా నటించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా భైర పాత్రలో జీవించేసాడు. మిగిలిన నటులు కూడా వాళ్ళ పాత్రలు తగ్గట్టు అద్భుతంగా నటించారు. వాటర్ సీక్వెన్సెస్ సినిమాకు ప్రధాన హైలైట్ అయ్యాయి.
షార్క్ షార్ట్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిందే. 90 ల కాలం నాటి పరిస్థితులకి అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రలు ఇలా అన్నీ కూడా పర్ఫెక్ట్ గా చూపించారు. హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చాలా దాకా బాగానే ఆకట్టుకుంది. కథనంపరంగా వచ్చే కొన్ని సీన్లు పెద్దగా ఆకట్టుకోలేదు. జాన్వి కపూర్, ఎన్టీఆర్ మధ్య లవ్ ట్రాక్ కూడా బెటర్ గా ఉండొచ్చు. అనుకున్న ఎమోషనల్ డ్రామాని ఎలివేట్ చేయడానికి దర్శకుడు ఆసక్తి చూపించారు. విజువల్ వండర్ గా సాగిన ఈ ఎమోషనల్ యాక్షన్ గ్రామాల్లో వైల్డ్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటుగా ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా బాగా ఉన్నాయి.
Also read:
ప్లస్ పాయింట్స్
ఎన్టీఆర్ నటన
కధ
సంగీతం
యాక్షన్ సీన్స్
ఫైట్స్
మైనస్ పాయింట్స్
కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండడం
లవ్ స్టోరీ బాగా ఆకట్టుకోలేకపోవడం
రేటింగ్: 3.25/5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!