Advertisement
క్రికెటర్ శ్రీశాంత్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈయన అతి తక్కువ కాలంలోనే మంచి క్రికెటర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎంత వేగంగా టీమిండియాలోకి వచ్చాడో అంతే వేగంగా వివాదస్పద క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. తన తోటి క్రికెటర్ హర్భజన్ సింగ్ తో కొట్లాటతో సహా పలు వివాదాలకు కారణమయ్యాడు శ్రీశాంత్. తన జీవితంలో కూడా నేరానికి పాల్పడ్డాడు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాలం నిషేదం ఎదుర్కొన్నాడు. అయితే సుప్రీంకోర్టు చొరువతో ఆ నిషేద సమయం కాస్త తగ్గించబడింది. వివాదాల తరువాత మళ్లీ మైదానంలోకి వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో రిటైర్ మెంట్ ప్రకటించాడు.
Advertisement
ఇలా ఎన్ని ఇబ్బందులను ఎదుర్కున్నప్పటికీ శ్రీశాంత్ కి తన భార్య తోడుగా నిలిచింది. అసలు తన భార్య ఎవరు ? ఆమె శ్రీశాంత్ కి ఎలా సహకరించింది ? శ్రీశాంత్ భార్య దివాన్ పూర్ రాజకుమారి భువనేశ్వరి. 2013లో దివాన్ పూర్ రాజకుమారి అయిన భువనేశ్వరితో శ్రీశాంత్ పెళ్లి ఏర్పాటు కొనసాగుతుండగా అతనిపై బ్యాన్ అనౌన్స్ మెంట్ చేశారు. శ్రీశాంత్ తల్లిదండ్రులకు ఏమి చేయాలో తెలియలేదు. ఇక ఆ పెళ్లి ఆగిపోవడం ఖాయమనుకున్నారు. కానీ భువనేశ్వరి పేరెంట్స్ మాత్రం శ్రీశాంత్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ పెళ్లిని ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. వాస్తవానికి వీరిది ప్రేమ వివాహం కాకపోతే కచ్చితంగా ఆగిపోయేదే.
Advertisement
ఇక రాజస్థాన్ రాజ కుటుంబం తమ బిడ్డ ప్రేమనే ప్రధానంగా భావించింది. 24 ఏళ్ల వయస్సులో శ్రీశాంత్ రాజస్థాన్ లో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లినప్పుడు భువనేశ్వరి పదోతరగతి చదువుతుంది. ఆ మ్యాచ్ లో శ్రీశాంత్ ని చూసి ప్రేమలో పడింది. భువనేశ్వరి 15 సంవత్సరాలకే శ్రీశాంత్ ని ప్రేమిస్తే.. శ్రీశాంత్ మాత్రం ఆమెకు 20 సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రేమిస్తున్నట్టు చెప్పలేదు. ఇక అప్పటివరకు వీరు ఫోన్ లో మాట్లాడుకునే వారు. శ్రీశాంత్ కి ప్రతీ విషయంలో కూడా తోడుగా నిలిచేది భువనేశ్వరి. హిందీ బిగ్ బాస్ షో వీకెండ్ లో అతన్ని కలిసేందుకు భువనేశ్వరి రావడంతో వారి ప్రేమ బట్టబయలు అయింది. క్రికెట్ ప్రపంచం నుంచి చాలా విమర్శలు వచ్చినప్పటికీ ఆ సమయంలో శ్రీశాంత్ భార్య అండగా నిలిచింది. శ్రీశాంత్, భువనేశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లలు కలరు. కూతురు శాన్విక, కుమారుడు సూర్య శ్రీ. ఏది ఏమైనప్పటికీ శ్రీశాంత్ ని ప్రేమించినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని విషయాల్లో భార్య భువనేశ్వరి అండగా నిలిచింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
వడ్డే నవీన్ భార్య ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!
కన్న తండ్రి కాళ్లు పట్టుకొని బతిమాలినా వినని కూతురు.. ఇక చివరికీ..!