Advertisement
తెలుగునాట అన్నగారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ పై కూడా ప్రత్యేక అభిమానం పెట్టుకుంటారు. ఇక ఎన్టీఆర్ సినిమాలు చేస్తూ ఓ రేంజ్ కి వచ్చాక ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్న కొన్ని సంఘటనలు ఎన్టీఆర్ అభిమానులకు వేదనని కలుగ చేస్తున్నాయి.
Advertisement
ఎన్టీఆర్ ను సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు పిలవకపోవడం.. ఎన్టీఆర్ మౌనంగా ఉండడం కూడా అభిమానులకు అంతగా నచ్చడం లేదు. ఈ మధ్య ఎన్టీఆర్ నందమూరి కుటుంబంతో పెద్దగా కలవడం లేదు. హరికృష్ణ మరణం తరువాత కళ్యాణ్ రామ్ తో బాగా కలిసిపోయిన నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం దూరంగా ఉన్నట్లే తారక్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఈ విషయంలో హర్ట్ అయిన ఓ ఎన్టీఆర్ అభిమాని ఆయనకు ఓ బహిరంగ ప్రేమ లేఖను రాసారు.
Advertisement
“గతంలో నిన్ను ప్రాణంగా ప్రేమించా.. ఇపుడు మాత్రం నందమూరి ఫామిలీ మెంబెర్ గా గౌరవిస్తాను అంతే.. నీ అవసరం మాకు లేదనీ.. వాడెవడో వచ్చి సపోర్ట్ చేశాడనీ.. నీపై అభిమానం తగ్గలేదు. మా రామన్నలో ఉన్న ఆవేశం, హరన్నలో ఉన్న తెగింపు, బాలయ్యలో ఉన్న ధైర్యం నీలో లేవు. నీ లోతైన మనస్తత్వం మాకు అర్ధం కాదు. నీ మొండితనాన్ని మేము భరించలేము. నీ మౌనాన్ని సహించలేకే నీ పై ప్రేమను నాకు నేనే చంపేసుకుంటున్నా.. ఓ సినీ లవర్ గా నీ సినిమా చూస్తా.. అంతవరకే.” అంటూ ఓ అభిమాని తన లేఖలో పేర్కొన్నాడు. ఈ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ లెటర్ పై చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు సపోర్ట్ గానే మాట్లాడుతున్నారు. ఇది వరకు ఆయనను పట్టించుకోని వారు ఇప్పుడు మాత్రం ఎలా మాట్లాడతారు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని..