Ads
ఉద్యోగాలు చేసేవాళ్ళు, హాస్పిటల్స్ కు వెళ్లేవాళ్లు, ఇతర అవసరాల కోసం బయటకు వెళ్ళేవాళ్ళు చాలా సందర్భాలలో ఎక్కువ సమయం పాటు బయట గడపాల్సి వస్తుంది. అయితే.. ఇటు వంటి సమయంలో కచ్చితంగా పబ్లిక్ టాయిలెట్స్ ను ఉపయోగించాల్సి వస్తుంది. అయితే.. పబ్లిక్ టాయిలెట్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. కొన్ని వేల మంది ఒక పబ్లిక్ టాయిలెట్ ను ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే.. ఇలాంటి సమయాల్లో తప్పకుండ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అసలు పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించకుండా మూత్రం ఆపుకోవడం కూడా మంచిది కాదు. ఎదో ఒక సమయంలో పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించకుండా ఉండడం కుదరదు. అందుకే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పబ్లిక్ టాయిలెట్స్ చూడ్డానికి శుభ్రంగా ఉన్నా సరే వాటిపై కొన్ని కనిపించని సూక్ష్మ క్రిములు ఉంటాయి. వాటివలన అనేక చర్మ సమస్యలు వస్తాయి. అందుకే పబ్లిక్ టాయిలెట్ సీట్ ఉపయోగించే ముందు వాటిపై టిష్యూ పేపర్ వేసి ఉపయోగించాలి. పని పూర్తి చేసుకున్న తరువాత చేతులను, కాళ్ళను శుభ్రంగా కడుక్కోవాలి.
Advertisement
చేతులను కడుక్కునే వరకు ముక్కు, కన్ను, నోరు వంటి సున్నితమైన అవయవాలను టచ్ చేయకూడదు. బయటకు వెళ్ళేటప్పుడు టిష్యూ పేపర్స్, శానిటైజర్లను మీతో తీసుకెళ్లడం ఉత్తమం. టాయిలెట్ సీట్ ఉపయోగించే ముందు నీరు లేదా శానిటైజర్ తో శుభ్రపరచడం, లేదా టిష్యూ పేపర్స్ వేసి ఉపయోగించండి. ఆ తరువాత పేపర్స్ డస్ట్ బిన్ లో పడవేయండి. చాలా మంది పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించడానికి ఉండే భయం కొద్దీ మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు. ఇది మరింత ప్రమాదకరం. ఎక్కువసేపు ఆపుకోవడం వలన మూత్రాశయ కండరాలు బలహీనపడతాయి. ఇది మరిన్ని ఇబ్బందులను తీసుకొస్తుంది.
మరిన్ని..