Advertisement
Neru Movie Review in Telugu: మలయాళం సినిమా అంటే చాలు కచ్చితంగా ఎదో ఒక ప్రయోగంతో సినిమా తీస్తారు అన్న టాక్ సినిమా లవర్స్ లో చాలా మందికి ఉండే ఉంటుంది. చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా.. చిన్న బడ్జెట్ సినిమా అయినా, పెద్ద బడ్జెట్ సినిమా అయినా.. వాళ్లకు నటనకు, కథనంకు ఇచ్చిన ప్రాధాన్యత దేనికీ ఇవ్వరు. అందుకే వారి సినిమాలు ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటాయి. అలంటి ఓ ప్రయోగాత్మక సినిమానే “నేరు”. ఈ మలయాళం సినిమా తెలుగు వారికి బాగా నచ్చేసింది. సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసి దుమ్ము దులుపుతోంది.
Advertisement
Neru Movie Story స్టోరీ:
సారా మహ్మద్ అనే అమ్మాయి అంధురాలు. ఆ అమ్మాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేస్తారు. స్వతహాగా శిల్పి అయిన సారా తనపై అత్యాచారం చేసిన వ్యక్తి రూపాన్ని ఓ శిల్పంగా మలుస్తుంది. ఆ విగ్రహం పోలికలుగా ఉన్న మైఖేల్ జోసెఫ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అతను ఓ ప్రముఖ బిజినెస్ మాన్ కుమారుడు. దీనితో ఈ కేస్ కి చాలా ప్రాధాన్యత వస్తుంది. మైఖేల్ తరపున ఓ పాపులర్ లాయర్ రాజశేఖర్ వాదిస్తారు. మైఖేల్ కు బెయిల్ కూడా వస్తుంది. అతను బయటకు రాగానే కేసు వాపస్ తీసుకోమని సారాని బెదిరిస్తారు. కానీ, ఆమె అందుకు ఒప్పుకోదు. ఈ క్రమంలో ఈ కేస్ ను లాయర్ విజయ్ మోహన్ కేసుని టేకప్ చేస్తారు. ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుంది? చివరకు ఏమవుతుందో తెలియాలంటే సినిమా చూడాలి.
Advertisement
రివ్యూ:
దృశ్యం సినిమాతో దర్శకుడు జీతూ జోషఫ్ కు తెలుగులో కూడా మంచి గుర్తింపు లభించింది. ఆయన సినిమాల్లో మోహన్ లాల్ నటించారు. వీరి కాంబోలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లెర్స్ అన్ని హిట్ అయ్యాయి. ఈ మూవీలో సస్పెన్స్ చివరిదాకా కొనసాగుతూ ఉంటుంది. జీతూ సినిమాల్లో కామన్ గా కనిపించే విషయం ఏంటంటే.. సినిమాలో కథ స్టార్ట్ అవ్వడానికి అరగంట పడుతుంది. నేరు సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అది మినహాయించి మిగతా కథ మొత్తం సస్పెన్స్ గా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కోర్టు రూమ్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ప్లస్ పాయింట్స్:
మోహన్ లాల్
జీతూ జోసెఫ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే
మైనస్:
కొన్ని కోర్టు సీన్స్ లాంగ్ అనిపించడం
రేటింగ్: 3/5
Read More:
అనస్వర రాజన్ ‘నేరు’ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
నాగచైతన్యకు రెండో తమ్ముడు ఉన్నాడని మీకు తెలుసా.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?
“కాంతారా” కంటే ముందే అదే కాన్సెప్ట్ తో ఓ సినిమా వచ్చిందని మీకు తెలుసా..!!