Advertisement
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పెద్ద అగ్నిపరీక్షగా మారబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి ? ఆయన ఒంటరిగా పోటీ చేస్తారా ? లేదా ఏదైనా పార్టీకి సపోర్ట్ చేస్తారా ? పోటీ చేస్తే సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళతారా ? ఇలా అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకంగా మారారు.
Advertisement
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే.. టిడిపి మరియు జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే బిజెపి పార్టీతో తన స్నేహం కొనసాగుతుందని కూడా పవన్ కళ్యాణ్ వివరించాడు. ఇక్కడ వరకు అంతా ఓకే… కాని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Advertisement
తెలంగాణ బిజెపి పార్టీ… తాము అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగా వెళతామని ఇప్పటికే స్పష్టం చేసింది. జిహెచ్ఎంసి ఎన్నికలలో కెసిఆర్ పార్టీకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారని.. ఇప్పటికీ తెలంగాణ బిజెపి నేతలు రగిలిపోతున్నారు. అటు చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో టిడిపి పార్టీ పోటీ చేస్తుందని వివరించారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో తాము కూడా కచ్చితంగా పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే పవన్ కళ్యాణ్ ఒంటరిగా వెళ్తారా ? ఇతర పార్టీల సపోర్ట్ తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీలు తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి అవకాశాలు లేవని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ముందు రెండు దారులు మాత్రమే ఉన్నాయి.
పోటీ చేస్తే ఒంటరిగా పోటీ చేయాలి లేదా తెలుగుదేశం పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకోవాలి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. కానీ తెలంగాణలో మరో 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఒకవేళ తెలంగాణలో పోటీ చేసినా… బిజెపికి వ్యతిరేకంగా ఉంటారా లేదా సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఉంటారా ? అనేది తీవ్ర గందరగోళంగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.
ఐవి కూడా చదవండి: తెలుగు ప్రజలకి బాబు భార్య ఓపెన్ లెటర్ ! అందులో ఏముందంటే ? ఆమె మాటలు నిజమే కదా ??