Advertisement
నరేంద్ర మోదీ ప్రకటనని కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇండియా అనే పేరును భారత్ గా మార్చబోతుందన్న వార్త ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశంగా మారింది. జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని ప్రింట్ చేయడానికి బదులు ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాయడం దేశవ్యాప్తంగా వివాదానికి దారి తీసింది. త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ‘ఇండియా’ పేరును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ తీర్మానాన్ని తీసుకురాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
ఈ మేరకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున స్పందించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అయితే.. టాలీవుడ్ గతంలో ఇదే విషయంపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ కార్యక్రమంలో ‘ఇండియా’, ‘భారత్’ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Advertisement
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నర్సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ మాట్లాడుతూ భారతదేశం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇండియాను భారత్ అని మారుస్తున్నారని చర్చ జరుగుతున్న వేళ పవన్ చేసిన ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు పెట్టిన పేరు. భారతదేశం అనేది మనది అని ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలలో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ విషయంలో కొందరు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇండియా అని బ్రిటిష్ వాళ్లు పేరు పెట్టారని అంటున్నారు సరే.. వారు కట్టిన స్కూల్స్, ఆస్పత్రులు, రైల్వే బ్రిడ్జ్‌లు ఇప్పటికీ ఉన్నాయ్ కదా వాటిని పడగొడతారా..? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడో సైరా నరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ అన్నమాటలు ఇప్పుడు వైరల్ గా మారడంతో.. ఈ విషయం పవన్ కి ముందు గానే తెలుసా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి:
మీరు ఇంతవరకు ఎప్పుడూ చూడని విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు రేర్ ఫోటోలు
తమకంటే “వయసు”లో పెద్ద వారిని పెళ్లి చేసుకున్న 5 క్రికెటర్లు…!
అతి చిన్న వయసులోనే జీవితాన్ని కోల్పోయిన 9టాలీవుడ్ జంటలు !