Advertisement
పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోక తప్పదు. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆయువు తీరిపోయిన తర్వాత తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతారు. మనుషులకి ఎలాంటి మినహాయింపు కూడా ఉండదు. కచ్చితంగా మనిషి ఏదో ఒక రోజు వెళ్లి పోవాల్సిందే. ఎప్పుడో ఒక రోజు హఠాత్తుగా మనిషి తనువు చాలిస్తుంటారు. ఆయువు ఉన్నంత వరకే ఎవరైనా ఈ భూమి మీద ఉండేది. అది ముగిసిపోయిన తర్వాత యముడు పాశం వేసి ప్రాణాలను తీసేస్తాడు. అయితే చనిపోయే ముందు చనిపోయే మనిషికి కొన్ని సంకేతాలు కనపడతాయి మరి ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
ఆయువు తీరింది అని చెప్పడానికి మన శరీరంలో కొన్ని సంకేతాలు లక్షణాలు కనబడుతుంటాయి. ముఖ్యంగా శక్తి స్థాయిలు పూర్తిగా తగ్గిపోతాయి. మన శరీరం మనకే చాలా భారంగా అనిపిస్తుంది. పనిచేయడానికి అసలు శక్తి లేనట్టు ఉంటుంది. ఎప్పుడెప్పుడు బరువు దించుకుందామా అన్నట్లుగా అనిపిస్తుంది. మనిషికి మరణం దగ్గర పడుతున్నప్పుడు బీపీ, హార్ట్ రేట్, శ్వాసక్రియ కూడా సరిగ్గా పనిచేయవు. శరీర ఉష్ణోగ్రత కూడా మాటిమాటికీ మారిపోతూ ఉంటుంది.
Advertisement
శ్వాస తీసుకోవడం కూడా ఎంతో కష్టంగా ఉంటుంది ఇటువంటివన్నీ కూడా మనిషి కొన్ని గంటల్లో చనిపోతున్నప్పుడు కలుగుతాయి. మానసిక స్థితి కూడా బాగా దెబ్బతింటుంది. సరిగ్గా ఆలోచించలేరు. ఏదో ప్రపంచంలో జీవిస్తున్నట్లుగా ఉంటుంది. చావు దగ్గర పడుతుంటే ఆకలి ఉండదు దాహం గా కూడా ఉండదు.
బరువు తీవ్రంగా తగ్గిపోతూ ఉంటారు. చర్మం రంగు ఉష్ణోగ్రత కూడా చావు సమీపిస్తున్నప్పుడు మారుతుంది. చర్మం కూడా పాలిపోయినట్లు ఉంటుంది. ఉష్ణోగ్రత తగ్గి చల్లగా అయిపోతుంది. చావు దగ్గర పడుతున్నప్పుడు కోమాలో ఉన్నట్లే ఉంటారు. కళ్ళు తెరిచి చూడలేరు కూడా. అంతేకాదు యమ ధర్మరాజు, యమ భటులు కనిపిస్తారట ఇలా ఈ సంకేతాలు మనిషి చనిపోయేటప్పుడు కనపడతాయి.
Also read:
ఆ మెసేజ్ ఏంటి ? ఎందుకు ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టింది ?
పవన్ కళ్యాణ్ పదే పదే రీకాల్ అంటున్నారు.. రీకాల్ అంటే అర్థం ఏంటో తెలుసా..?
ఆవిషయంలో చరణ్ జడ్జిమెంట్ కరెక్ట్.. రిజెక్ట్ చేసిన సినిమాల్లో డిజాస్టర్స్ ఎన్నో తెలుసా ?