Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రీల్ స్టార్లు రియల్ స్టార్ లుగా కూడా దిగారు. కొంతమంది ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కానీ రియల్ స్టార్ లయ్యారు.. మరి రీల్ స్టార్ ల నుంచి రియల్ స్టార్లు అయిన వారెవరో.. ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా రియల్ స్టార్ అయిన వారెవరో ఇప్పుడు చూద్దాం.. తమిళనాడు విషయానికొస్తే ఎంజీఆర్, జయలలిత సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అదే తెలుగు నాట రీల్ స్టార్ గా ఎంతో గుర్తింపు సాధించిన ఎన్టీఆర్ టిడిపి పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే తెలుగు రాష్ట్రానికి సీఎం అయ్యి చరిత్ర సృష్టించారు. 1983లో కాంగ్రెస్ ను ఢీకొన్న యోధుడిగా ఎన్టీఆర్ ను గెలిపించిన ప్రజలు, మళ్లీ 1989లో ఓడించారు. 1994లో మళ్లీ అధికారం ఇచ్చారు.
Advertisement
also read: చిరంజీవిని నా పక్కనే కూర్చుంటావా..? అని అవమానించిన హీరోయిన్ ఎవరంటే ?
Advertisement
ఆ తర్వాత పరిణామాల్లో చంద్రబాబుకు పార్టీ పగ్గాలు అందాయి. ఇలా రీల్ స్టార్ నుంచి రియల్ స్టార్ గా మారారు అన్న ఎన్టీఆర్. ఇక చంద్రబాబు 1999లో ఎలాంటి రీల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ముఖ్యమంత్రి అయి రియల్ స్టార్ అయ్యారు. అంతేకాదు 2004,2009 ఎన్నికల్లో ఓడినా, 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో ఓడిపోయారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకొని ప్రజారాజ్యం పార్టీ పెట్టి, మళ్లీ ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా చేశారు. ఇక కొంతమంది సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లో రియల్ స్టార్ లుగా నిరూపించుకున్న వారు ఉన్నారు. మోహన్ బాబు, మురళీమోహన్, జయప్రద వంటి వారు అప్పట్లో టిడిపికి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు,జమున కూడా కాంగ్రెస్ నుంచి బరిలో ఉండి గెలిచారు. ఇక విజయశాంతి ఎంపీగా టిఆర్ఎస్, కోట శ్రీనివాసరావు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు సుమన్,ఆలీ,కవిత, దివ్యవాణి వంటి వారు కూడా టిడిపిలో పనిచేస్తున్నారు..
also read: చిరంజీవిని నా పక్కనే కూర్చుంటావా..? అని అవమానించిన హీరోయిన్ ఎవరంటే ?
రియల్ హీరోలు :
కాంగ్రెస్లో సుదీర్ఘకాలం అసమ్మతినేతగా ముద్ర వేసుకున్న వైయస్సార్ పాదయాత్ర తర్వాత 2004 ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రియల్ స్టార్ గా నిలిచారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తూ రియల్ స్టార్ గా ఎదిగారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా పార్టీ స్థాపించి రీల్ స్టార్ నుంచి రియల్ స్టార్ గా ఎదిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
also read: Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 08.04.2023