Advertisement
ఒకప్పుడు చిన్న పిల్లల మనసంతా సూపర్ మాన్, శక్తీ మాన్ వంటి కల్పిత పాత్రల చుట్టూనే తిరిగింది. కానీ ఇప్పుడు ఏ నోట విన్నా హనుమాన్ అన్న పేరే వినిపిస్తోంది. హిందూ పురాణం ప్రకారం ఏడుగురే చిరంజీవులుగా ఉన్నారు. వీరు వరం వల్లనో, శాపం వల్లనో చిరంజీవులుగా ఉన్నారు. అయితే.. వీరిలో మొదటి వాడే హనుమ. శ్రీరాముడిని గుండెల్లో పెట్టి కొలుచుకునే హనుమ ఆయన అవతారం చాలించినా ఇంకా చిరంజీవుడిగానే ఉన్నాడు. అయితే ఎందుకు చిరంజీవిగా ఉన్నాడో అందరికి తెలిసిందే.
Advertisement
చిన్నారిగా ఉన్నపుడు హనుమ సూర్యుడిని పండు అనుకుని మింగేయడానికి వెళ్తాడు. అయితే హనుమ సూర్యుడిని మింగేయడంతో లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి. అయితే ఇంద్రుడు హనుమపై వజ్రాయుధంతో దాడికి వస్తాడు. అప్పుడు హనుమ మూర్చబోతాడు. దీనితో హనుమ తండ్రి వాయుదేవుడు గాలిని స్తంభింపచేస్తాడు. దీనితో ఇంద్రుడు, బ్రహ్మతో సహా అందరు దేవతలు హనుమకు వరాలిస్తారు. చిరంజీవిగా కొనసాగమని ఆశీర్వదిస్తారు. అప్పుడు వాయు దేవుడు శాంతిస్తాడు. ఆ తరువాత శ్రీరాముడు తన అవతారాన్ని చాలించే సమయంలో రమ్మని పిలుస్తాడు అని మరో కథనం కూడా ఉంది.
Advertisement
కానీ హనుమ వెళ్ళడానికి ఒప్పుకోడు. రామ నామం ఎక్కడ వినిపిస్తుందో.. అక్కడ నేను ఉంటా అని చెబుతాడట. అయితే హనుమ విష్ణుమూర్తి పదకొండవ అవతారం అయినా కల్కి కోసం కూడా ఎదురు చూస్తూ ఇక్కడే ఉండిపోయాడని కూడా చెబుతుంటారు. కలిని అంతం చేసే సమయంలో స్వామి వారికి తోడుగా ఉండడం కోసమే హనుమ ఆగిపోయాడని కూడా చెబుతుంటారు. ఇక రెండవ వ్యక్తి పరశురాముడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారికి గురువు అయిన పరశురాముడు కల్కి అవతారానికి కూడా గురువుగా ఉంటారు. ఆయన కల్కి రాక కోసం మహేంద్ర పర్వతంపై తపస్సు చేస్తూ ఎదురు చూస్తున్నాడట. ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ కూడా చిరంజీవే. రామరావణ యుద్ధంలో ధర్మానికి కట్టుబడి ఉన్న విభీషణుడు కూడా చిరంజీవిగానే ఉన్నాడు. ధర్మ మార్గంలో నడిచేవారికి ఆయన తోడుగా ఉంటారట. అసురుల రాజు బలి చక్రవర్తి కూడా చాలా మంచివాడు. విష్ణువు చేతిలో పాతాళానికి అణగదొక్కబడిన బలి చక్రవర్తి తిరిగి మళ్ళీ వస్తారట. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు సాయం చేసిన కృపాచార్యుడు కూడా చిరంజీవిగా ఉన్నారు. అధర్మం వైపే పోరాడినా చివరివరకు ధర్మంగా ఉండడంతో మెచ్చిన కృష్ణుడు చిరంజీవిగా ఉండమని వరమిస్తాడు. మహాభారతాన్ని కళ్ళకు కట్టినట్లు రాసిన వ్యాసమహర్షి కూడా చిరంజీవిగానే ఉన్నారు. వీరిలో ఇద్దరు అంటే హనుమాన్, విభీషణుడి గురించి హనుమాన్ సినిమాలో వచ్చింది. అయితే.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో రాబోయే పన్నెండు సినిమాలు కూడా ఇలానే ఉంటాయని.. ఇతిహాసాల నుంచే క్యారెక్టర్స్ తీసుకుంటానని ప్రశాంత్ వరం తెలిపారు. వాళ్ళందరిని పెట్టి సినిమా తెస్తే అది ఏ రేంజ్ లో హిట్ అవుతుందో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Read More:
నాగచైతన్యకు రెండో తమ్ముడు ఉన్నాడని మీకు తెలుసా.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?
“కాంతారా” కంటే ముందే అదే కాన్సెప్ట్ తో ఓ సినిమా వచ్చిందని మీకు తెలుసా..!!
షోయబ్ మాలిక్ పెళ్లి తర్వాత అధికారిక ప్రకటన చేసిన సానియా మీర్జా ఫ్యామిలీ!