Advertisement
ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకుంటారు. కానీ ఒకప్పుడు మాత్రం పెళ్లిళ్లుని చిన్న వయసులోనే జరిపేవారు. అయితే ఈ రోజుల్లో 30 ఏళ్లు దాటినా కూడా పెళ్లిళ్లు చేసుకోవట్లేదు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని పెద్దలు అంటారు. పూర్వకాలంలో అందరికీ చిన్న వయసులో పెళ్లిళ్లు జరిగేవి. పెళ్లి వయసు దాటిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడం వలన నష్టాలు ఉంటాయి. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వలన కొన్ని సమస్యలు తప్పవని.. నిపుణులు అంటున్నారు. ఏ సమయంలో పెళ్లి చేసుకోవాలి..? పెళ్లి ఆలస్యంగా చేసుకోవడం వలన ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
Advertisement
పెళ్లికి, వయస్సుకి సంబంధం ఉందని కొందరు అంటున్నారు. వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. తర్వాత పెళ్లి చేసుకున్న ప్రయోజనం లేదు. మహిళలకి 30 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఆ సమయంలో అండం రిలీజ్ కావడం కష్టం. అదే వయసులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెళ్లి చేసుకోకుండా ఉండడం వలన మహిళలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయట. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టట్లేదని, సంతోషంగా ఉండట్లేదని చాలామంది అంటున్నారు.
Also read:
పెళ్లి అనేది వయసుతో సంబంధం లేదు. మెంటల్ గా చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండాలని చాలామంది నిర్ణయించుకుంటారు. కానీ ప్రతి వ్యక్తికి తోడు అవసరం. ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని షేర్ చేసుకోవడానికి మనకంటూ ఒక మనిషి ఉండాలి. అప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా మెంటల్ గా పెళ్లికి ఎప్పుడు కూడా రెడీ అవ్వకూడదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!