Advertisement
పూరి జగన్నాథ్ అలీ బంధం విడతీయలేనిది. దర్శకుడుగా కెరియర్ మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అలీ లేకుండా సినిమా తీయలేదు. ఆయనను లక్కీ హ్యాండ్ గా భావించారు. పూరి జగన్నాథ్ సినిమాలో కచ్చితంగా అలీ కోసం ఓ పాత్ర రాస్తారు. ఫెయిల్ అయితే వచ్చి ఓ పెగ్గు పోసి, భుజం తట్టి వెళ్తాడని.. హిట్టు కొడితే మాత్రం బొకేతో వస్తాడని ఆలీతో తనకి ఉన్న బంధాన్ని ఎన్నోసార్లు పూరి జగన్నాథ్ చెప్పారు. అలాంటిది తన లేటెస్ట్ మూవీ డబల్ ఇస్మార్ట్ లో అలీ సీన్స్ ని పూర్తిగా తీసేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు.
Advertisement
ఆగస్టు 15 న డబల్ ఇస్మార్ట్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది ప్రీ రిలీజ్ బిజినెస్ 60 కోట్ల పైన జరిగింది ట్రైలర్ టీజర్ ఇతర ప్రమోషన్ కార్యక్రమంలో జనం థియేటర్లకు బానే వచ్చారు. డబల్ ఇస్మార్ట్ కి ఓపెనింగ్స్ బానే వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో 45 నుంచి 50% ఆక్యుపెన్సి వచ్చిందని కర్ణాటక హిందీ బెల్ట్ లో మాత్రం డబల్ ఇస్మార్ట్ ప్రభావం చూపించలేకపోయిందని అంటున్నారు. పూరి ఫాన్స్ అయితే మాత్రం ఈ సినిమా ఫీస్ట్ అని అంటున్నారు. కొన్ని సీన్లు ట్రిమ్ చేస్తే బెటర్ అని కామెంట్లు వినపడుతున్నాయి. ఇందులో అందరూ అలీ పాత్ర గురించి వేలెత్తి చూపిస్తున్నారు.
Advertisement
Also read:
Also read:
తొలినుంచి ఈ క్యారెక్టర్ కి విపరీతమైన హైప్ తీసుకొచ్చారు. పూరి జగన్నాథ్ సినిమాలో ఆలీకి డిఫరెంట్ రోల్ ఉంటుందని ఆశపడి థియేటర్ కి వచ్చిన వాళ్ళు సహనానికి పరీక్ష పెట్టారు డబల్ ఇస్మార్ట్ లో ఇంట్రడక్షన్ వరకు ఓకే కానీ క్రమంగా అలీ పాత్ర బోర్ కొట్టింది. దీనికి తోడు అసభ్యకరమైన సైగలు, వల్గారిటీతో ఏదో సినిమాలో అలీ ఉండాలి కాబట్టి ఇరికించి పెట్టినట్లు ఈ పాత్ర ఉంది. కెరియర్ లో ఎన్నో గుర్తుండిపోయి పాత్రలు చేసిన అలికి పాత్ర చెడ్డ పేరు తీసుకొచ్చింది. అందుకనే అలీ పాత్రని అలీ సీన్స్ ని తీసేసినట్లు తెలుస్తోంది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!