Advertisement
ఏదైనా జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే, మీకు శుభవార్త. ఢిల్లీ లోని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. railtelindia.com ద్వారా ఆన్లైన్లోనే అప్లై చేసేయవచ్చు. 81 పోస్టులను భర్తీ చేస్తున్నారు. భారతదేశంలో ఎక్కడైనా పని చేయాలనుకునే వాళ్ళు దరఖాస్తు చేసేయచ్చు. నవంబర్ 11, 2023 లోగా దరఖాస్తు చేయాల్సి వుంది.
Advertisement
ఇక వయస్సు విషయానికి వస్తే… డిప్యూటీ మేనేజర్ కి 21 నుండి 30 సంవత్సరాలు, మేనేజర్ కి 23 నుండి 30 సంవత్సరాలు, సీనియర్ మేనేజర్ కి 27 నుండి 34 సంవత్సరాలు వయసు ఉండాలి. ఇక విద్యార్హతల వివరాల లోకి వెళితే.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్ పరీక్షలు అలానే ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టుల కోసం ఎంపిక చేస్తారు.
Advertisement
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్‌టెల్‌లో చేరిన అభ్యర్థుల తేదీ నుండి 02 సంవత్సరాల పాటు రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. నెలవారీ వేతనం రూ. 140000గా వుంది. ఆన్లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. రూ. 1200 దరఖాస్తు రుసుము పే చేయాలి. SC/ST/PwBD కేటగిరీ అభ్యర్థులు రూ. 600. ఇంకా జీతం వివరాలు చూస్తే.. డిప్యూటీ మేనేజర్‌కు నెలకు 40,000-1,40,000. మేనేజర్ పోస్టుకు అయితే 50,000 నుండి 1,60,000. సీనియర్ మేనేజర్‌కు 60,000 నుండి 1,80,000 రూపాయలు ఇస్తారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి..!