Advertisement
కోట్లాదిమంది ఇండియన్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూసిన ఆస్కార్ అవార్డు వేడుక ఈరోజు ఘనంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు ఇండియన్ సినిమా, అది మన తెలుగు సినిమా పాట “నాటు నాటు” కి దక్కింది. 95వ అకాడమీ అవార్డులలో తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు దక్కింది. ఓ తెలుగు చిత్రం ఆస్కార్ కి నామినేట్ కావడం ఇదే తొలిసారి. ఆ పురస్కారం అందుకోవడం కూడా మొదటి సారే. నాటు నాటు పాటకి సంగీతం అందించిన ఎంఎం కీరవాణి ఆస్కార్ ప్రతిమ అందుకున్నారు.
Advertisement
Read also: VIJAYASHATHI HUSBAND: విజయశాంతి భర్తకు నందమూరి కుటుంబానికి ఉన్న బంధుత్వం గురించి తెలుసా ?
ఈ సందర్భంగా ఆయన రాజమౌళిని ఉద్దేశిస్తూ ఓ పాట కూడా పాడారు. ఇది పక్కన పెడితే రాజమౌళి – కీరవాణి ఇద్దరు తొడల్లుళ్లు అన్న విషయం మనకు తెలిసిందే. రాజమౌళి ప్రేమించి పెళ్లి చేసుకున్న రమా రాజమౌళి, కీరవాణి భార్య శ్రీవల్లి ఇద్దరూ అక్క చెల్లెళ్లు. అందుకే వీరిద్దరూ తోడల్లుళ్ళు అయ్యారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, ఒకే తండ్రికి పుట్టకపోయినా సొంత అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటున్న సోదరులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో రాజమౌళి, కీరవాణి ఉన్నారు. ఏమీ లేని స్థితిలో ఎలా అయితే కలిసి ఉన్నారో.. ఈరోజు ఆస్కార్ అందుకున్నప్పటికీ కూడా అలాగే ఉన్నారు. కీరవాణి లేకపోతే రాజమౌళి సినిమా మూగబోతుందనడంలో ఆశ్చర్యం లేదు.
Advertisement
ఇద్దరూ కలిసి సినిమాకి పనిచేస్తే పని రాక్షసుల్లా పనిచేస్తారు. బాహుబలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే అన్నదమ్ములు ఇద్దరు కంటతడి పెట్టుకున్నారంటే వీరికి ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుండి ఆర్ఆర్ఆర్ వరకు కలిసే ఉన్నారు, కలిసే పని చేశారు, కలిసే సినిమాని ఆస్కార్ బరిలో నిలిపారు, నాటు నాటు పాటకి ఆస్కార్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఈ అన్నదమ్ములకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి – కీరవాణి ఇద్దరూ ఒకే ప్లేటులో చపాతి తింటున్న ఈ సన్నివేశం చాలా ఏళ్ల క్రితం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read also: ACTRESS HEMA HUSBAND: నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?