Advertisement
Vijayashathi Husband: టాలీవుడ్ ఇండస్ట్రీలోని లేడీ సూపర్ స్టార్ గా ఎనలేని ఆదరాభిమానాలు సంపాదించుకున్న హీరోయిన్ విజయశాంతి. అప్పట్లో ఆమె సినిమాలు అంటే హీరోలతో సమానంగా పోటీ పడి మరీ వచ్చేవి అంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా విజయశాంతి తెలుగు ఇండస్ట్రీలోని అభిమానులను సంపాదించుకుంది. అయితే, విజయశాంతి టాలీవుడ్ లో ఎక్కువగా బాలకృష్ణకు జోడిగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
READ ALSO : ఇంటిముందు కాకి అరిస్తే అది మరణ సూచకమా?
వీరిద్దరూ కలిసి మొదట పట్టాభిషేకం సినిమాలో నటించారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కలిసి నటించారు. అంతేకాకుండా బయట కూడా వీరు స్నేహంగా ఉండేవారు. దాంతో విజయశాంతి, బాలయ్యలు ప్రేమలో ఉన్నారు అంటూ కూడా అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆ వార్తలు ఎలాంటి నిజం లేదని ఆ తర్వాత తెలిసింది. ఇక విజయశాంతి పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. విజయశాంతి రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ ప్రసాద్ ను వివాహం చేసుకున్నారు.
Advertisement
కానీ ఈ జంట ఎప్పుడు మీడియా ముందు కనిపించలేదు. అయితే బాలకృష్ణకు విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చాలామందికి తెలియదు.బాలయ్యకు, శ్రీనివాస్ ప్రసాద్ ప్రాణ స్నేహితుడని, అంతేకాకుండా బాలకృష్ణ సలహా మేరకే విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు కూడా ఉన్నాయి. మరోవైపు విజయశాంతి భర్తతో కలిసి ఉంటున్నారా? వారి పిల్లలు ఉన్నారా? అన్న విషయాలు మాత్రం ఎవరికీ తెలియదు. ఇక విజయశాంతి ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
READ ALSO : మన స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకునే సమయానికి వీరి ఏజ్ ఎంతంటే ?