Advertisement
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ సినిమాలలో కన్నా ఎక్కువగా పర్సనల్ విషయాలు, వివాదాలతోనే పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. గత కొంతకాలంగా సీనియర్ నటుడు నరేష్ – పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని డిసెంబర్ 31వ తేదీన వీరిద్దరూ లిప్ కిస్ చేసుకుంటున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 2023 కి కొత్తగా స్వాగతం పలుకుతున్నామంటూ పేర్కొనడం సంచలనంగా మారింది. అంతేకాదు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని కూడా ఈ జంట తెలిపింది.
Advertisement
Read also: పవన్ ఫాన్స్ ని భలే వెన్నుపోటు పొడిచావ్ బండ్ల అన్న..!
Advertisement
ఈ విషయంపై జనాల్లో ఓ రేంజ్ లో చర్చలు నడుస్తూ ఉండగా.. తాజాగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్ చేసింది. నరేష్ – పవిత్రల పెళ్లి జరగనివ్వనంటూ రమ్యా రఘుపతి ఫైర్ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్య రఘుపతి నరేష్ వ్యక్తిత్వానికి సంబంధించిన పలు విషయాలపై, అలాగే వీరు విడుదల చేసిన లిప్ లాక్ వీడియోపై ఘాటుగా రియాక్ట్ అయింది. ” నరేష్ కి నాకు విడాకులు అయిపోయాయి అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. మా విడాకుల ప్రక్రియ ఇంకా కోర్టులోనే ఉంది. నన్ను వదిలించుకోవడానికి నరేష్ దారుణాతి దారుణాలు చేశాడు.
పవిత్ర మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు నా చేత్తోనే అన్నం పెట్టాను. అన్నం పెట్టిన చేతికే సున్నం రాస్తుంది. ఏది ఏమైనా నరేష్ కు విడాకులు ఇచ్చేదే లేదు. నావల్ల కృష్ణ గారికి హాని ఉన్నట్లు.. కృష్ణ గారు రాసినట్టు ఓ లెటర్ రాసి ఆయన సంతకాన్ని నరేష్ ఫోర్జరీ చేశారు. ఆ లెటర్ తో నాపై కేసు వేయించారు. ఈ విషయం కృష్ణ గారికి తెలియదు. దీని గురించి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. నా కుమారుడు నాన్న కావాలని అంటున్నాడు. కాబట్టి నరేష్ కి విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు” అని చెప్పుకొచ్చింది రమ్య రఘుపతి.
Read also: ఎంత విషపు పాము కాటేసిన..! వెంటనే ఇలా చెయ్యనండి ప్రాణాలను కాపాడండి ..!