Advertisement
నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్యూట్ హీరోయిన్ రష్మిక మందన, “ఛలో” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఆనాటి కాలంలోనే ఈ సుందరి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ అమ్మడికి మంచి అవకాశాలు రాగా వాటిని సద్వినియోగం చేసుకుంది. ప్రజెంట్ ఈ భామ పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై చాలా సీరియస్ అయింది రష్మిక. తన సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చింది.
Advertisement
“ఎన్నో ఏళ్ల నుంచి కొన్ని విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని ఇప్పుడు మీతో పంచుకోవాల్సిన సమయం వచ్చిందనుకుంటున్న. నటిగా కెరీర్ మొదలైన నాటి నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, నెగిటివిటీ నన్ను బాధ పెట్టాయి. అయితే నేను ఎంచుకున్న జీవితం అలాంటిది. ఇక్కడ అందరికీ నేను నచ్చనని, అలాగే, ప్రతి ఒక్కరి ప్రేమను పొందాలనుకోకూడదని అర్థమైంది. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ప్రతిరోజు కష్టపడి పనిచేయడం మాత్రమే నాకు తెలుసు. మీరు, నేను గర్వించే విధంగా పనిచేసేందుకే శ్రమిస్తున్న. అందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా”
“నేను మాట్లాడని విషయాల గురించి కూడా నన్ను హేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వాటిని చూసి నా హృదయం ముక్కలైంది. పలు ఇంటర్వ్యూలో నేను మాట్లాడిన కొన్ని మాటలు నాకు వ్యతిరేకంగా మారడాన్ని గుర్తించా. ఇంటర్నెట్ లో వస్తున్న తప్పుడు సమాచారం వల్ల నాకే కాకుండా నా సహచరులకు ఇబ్బంది కలిగింది. విమర్శలను పట్టించుకోకూడదు అని ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్నా. కానీ, ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. సోషల్ మీడియా నెగెటివిటీ గురించి మాట్లాడి నేను ఎవరి మీదనో విజయం సాధించానని అనుకోవడం లేదు. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపై నాకు ప్రేమాభిమానం ఉంది” అంటూ రష్మిక పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
REad also : గ్రహణం రోజు ఈ నియమాలు పాటిస్తే, దోషాలు పోతాయి !