Advertisement
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కవిత బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ధర్మాసనం తీవ్రంగా తప్పు పడుతోంది. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకోవడం జరిగింది. బాధ్యతగా ఉండాల్సిన సీఎం కోర్టు తీర్పు పై వ్యాఖ్యలు ఎలా చేస్తారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పొలిటికల్ కామెంట్స్ కి తాము భయపడమని స్పష్టం చేసింది.
Advertisement
మా డ్యూటీ చేస్తామని చెప్పింది. ఈరోజు ఓటుకి నోటు కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చూసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరిగింది. విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ రావడం పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Also read:
Also read:
బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలో కేవలం 5 నెలలలో కవితకు బెయిల్ వచ్చిందని వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు 16 నెలలైనా బెయిల్ రాలేదని 16 నెలలకు బెయిల్ వచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!