Advertisement
ఇటీవల పబ్లిక్ పార్క్స్ లలోనే కాకుండా.. పలు పబ్లిక్ ప్లేసెస్ లో లవర్స్ చేస్తున్న పనులకు అడ్డూ అదుపు ఉండడం లేదు. పబ్లిక్ లో ఉన్నాం అన్న విషయాన్నీ కూడా మరిచిపోయి బిహేవ్ చేస్తున్నారు. లిఫ్టులు, పబ్లిక్ ట్రైన్స్ లాంటి ప్రదేశాల్లో కూడా చెలరేగిపోతున్నారు. ఇలాంటి ఘటనలు కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. ఇటువంటి పనులు చేస్తున్న వారిపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల మెట్రో ట్రైన్ లో ఇలాంటి ఓ సంఘటనే చోటు చేసుకుంది.
Advertisement
ఎన్ని సంఘటనలు జరుగుతున్నా, ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్న కొందరు ప్రేమ జంటలు అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల ఓ ప్రేమ జంట మెట్రో ట్రైన్ లో పబ్లిక్ గా రొమాన్స్ చేసుకుంటూ ఉన్నారు. రద్దీగా ఉన్న ట్రైన్ లో రొమాన్స్ తో రెచ్చిపోవడంతో వారిపై పక్కనే ఉన్న ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఢిల్లీ మెట్రో రైల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోలో ఓ ప్రేమ జంట పబ్లిక్ గా మెట్రోలో రొమాన్స్ తో రచ్చ చేసింది. ముద్దులు, హగ్గులు కాకుండా ప్రైవేట్ పార్ట్స్ ని కూడా టచ్ చేసుకుంటూ శృతి మించారు. దీనితో చాలా మంది చిరాకు పడ్డారు. అయినప్పటికీ ఎవరు ఎలాంటి కామెంట్ చేయలేదు. సైలెంట్ గా పక్కకు తప్పుకున్నారు.
Advertisement
కానీ, ఓ మహిళ మాత్రం ఆగ్రహించి వారిని నిలదీసింది. పబ్లిక్ ప్లేస్ లో ఇదేమి పాడు పని అంటూ నిలదీసింది. చాలా సేపు సైలెంట్ గా నిగ్రహించుకున్నా వారు వారి చేష్టలు ఆపకపోవడంతో విసుగెత్తిన మహిళ వారిని అడ్డుకుని నిలదీసింది. దీనితో ఆ యువకుడు మా ఇష్టం అడగడానికి మీరెవరు అంటూ వాదించాడు. కొంతసేపు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తోటి ప్రయాణికులు కొంత సర్దిచెప్పేసరికి ఇద్దరూ శాంతించారు. అదే ట్రైన్లో ఉన్న ఇతర ప్రయాణీకులు దీనిని వీడియో తీయడంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.
మరిన్ని..
Jr Ntr open Letter: హర్ట్ అయిన ఎన్టీఆర్ అభిమాని.. ఎమోషనల్ గా రాసిన ఓపెన్ లెటర్.. అందులో ఏముందంటే?
పబ్లిక్ టాయిలెట్స్ తో ప్రమాదకర రోగాలు.. వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి!