Advertisement
క్రికెట్ లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ గుండెపోటుకు గురయ్యాడు. ప్రస్తుతం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో కామెంటేటర్ గా విధులు నిర్వహిస్తున్న అతను చాతినొప్పి బారిన పడ్డాడు. దీంతో వెంటనే పాంటింగ్ ను ఆసుపత్రికి తరలించారు.
Advertisement
అయితే ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని, ముందు జాగ్రత్తలో భాగంగానే ఆసుపత్రికి తరలించామని అతనితో కామెంటరీ బాధ్యతలు నిర్వహిస్తున్న సహచరులు తెలిపారు. కాగా 47 ఏళ్ల పాంటింగ్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ‘రికీ పాంటింగ్ తీవ్ర అస్వస్థతో ఉన్నాడు. ఈరోజు మిగిలిన మ్యాచ్ లో అతను కామెంటరీ చేయడం లేదు. అతను త్వరలోనే మళ్లీ మైక్ పట్టుకుంటాడు అని చానల్ 7 ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు. ఇక పాంటింగ్ అస్వస్థతకు గురయ్యాడని తెలుసుకున్న అతని ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ సైతం గుండెపోటుతోనే ఈ ఏడాది మరణించిన విషయం తెలిసిందే.
Advertisement
ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ కలవరపాటుకు గురయ్యారు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు పాంటింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆస్ట్రేలియా క్రికెట్ కు సంబంధించి పాంటింగ్ కు ప్రత్యేక స్థానం ఉంది. వన్డే క్రికెట్ తో పాటు టెస్ట్ ఫార్మాట్లోను అతను అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. అతని సారథ్యంలోనే ఆస్ట్రేలియా మూడు వన్డే ప్రపంచ కప్ లు గెలుచుకుంది. 2012లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన పాంటింగ్ ప్రస్తుతం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు హెడ్ కోచ్ గా ఉంటున్నాడు.
READ ALSO : కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై BCCI భారీ కుట్ర! కోచ్ పదవి ఔట్ ?