Advertisement
సంక్రాంతి సందర్భంగా వీరసింహారెడ్డితో మెప్పించారు బాలయ్య. కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టారు. సినిమాలోని పంచ్ డైలాగులు బాగా పేలాయి. అయితే.. వైసీపీకి ఇండైరెక్ట్ కౌంటర్ లా ఉన్న కొన్ని డైలాగులపై ఏపీలో హీట్ పెరిగింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఇదే సమయంలో బాలకృష్ణ ఏపీలో ఎమర్జెన్సీ పాలన సాగుతోందని విమర్శలు చేయడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలో మంత్రి రోజా తనదైన రీతిలో బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
Advertisement
బాలయ్య సెటైర్స్
ఏపీలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది. ఒక సామాన్య ఓటరుగా, పౌరుడిగా, ఎమ్మెల్యేగా ఈ విషయం చెబుతున్నా. వీరసింహారెడ్డి సినిమాలోని డైలాగులు ప్రభుత్వాన్ని ఉద్దేశించినవో కావో జనానికి తెలుసు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. పండుగ వేళ కుటుంబ సమేతంగా చూసే ఓ మంచి ఫ్యామీలీ సినిమాను ప్రేక్షకులకు అందించాం. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.
Advertisement
రోజా కౌంటర్స్
బాలయ్యది స్క్రిప్ట్ లు రాసిచ్చినా మాట్లాడలేని పరిస్ధితి. సినిమాల్లో ఎన్ని డైలాగ్స్ కొట్టినా చప్పట్లు కొట్టడానికే పనికొస్తాయి. జీవో నెంబర్ 1 గురించి పూర్తిగా చదివితేనే అర్ధమౌతుంది. రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్ధితులు వున్నాయని అనడం సిగ్గుచేటు. చంద్రబాబు భ్రమ నుంచి బాలకృష్ణ బయటకు రావాలి. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తి.. అది ఎందుకు తీసుకొచ్చామో తెలుసుకుంటే ఎమర్జెన్సీ అనే కామెంట్ ను వెనక్కి తీసుకుంటారు.
ప్రస్తుతం బాలయ్య, రోజా కామెంట్స్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు ఆడిపోసుకుంటున్నారు.