Advertisement
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగుల తరహాలోనే.. మన ప్రజా ప్రతినిధులు ప్రతినెల జీతాలు తీసుకుంటారు. గ్రామ సర్పంచి నుంచి ప్రధాని వరకు, ప్రతి నెల వారికి జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే మన దేశంలో ముఖ్యమంత్రిల జీతాలు ఎంత ఉన్నాయి? ఎవరు ఎక్కువగా తీసుకుంటున్నారు ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Also Read: దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ బాలనటి.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..?
దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కువ జీతాన్ని పొందుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నెలకు రూ. 4.10 లక్షల జీతం వస్తోంది. వీటితో పాటు హౌస్ అలవెన్స్, టెలిఫోన్ బిల్లులు, అంతర్రాష్ట్ర ప్రయాణ ఖర్చులు, వంటి ఆదనపు అలవెన్స్ లు కూడా ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఢిల్లీ సీఎం రెండో స్థానంలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నెలకు రూ. 4 లక్షల జీతం లభిస్తోంది. ఆదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ఆయనకు నెలకు 3 లక్షల 65 వేల రూపాయల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కు 3 లక్షల 40 వేల రూపాయల జీతం లభిస్తోంది. అత్యధిక జీతం పొందుతున్న ముఖ్యమంత్రిల జాబితాలో ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. జీతంతో పాటు ఆదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
Advertisement
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నెలకు 3 లక్షల 21 వేల రూపాయల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ నెలకు 3 లక్షల 10వేల రూపాయల జీతం లభిస్తుంది. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ నెలకు రెండు లక్షల 88 వేల రూపాయలను జీతం తీసుకుంటున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నెలకు 2 లక్షల 72 వేల రూపాయలను జీతంగా తీసుకుంటున్నారు. ఆదనంగా ఇతర అలవేన్సులు కూడా ఉంటాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నెలకు 2 లక్షల 55 వేల రూపాయలను జీతం గా తీసుకుంటున్నారు. ఆధారంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నెలకు 2 లక్షల 15 వేల రూపాయలను జీతం గా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్స్ లు కూడా ఉంటాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నెలకు 2 లక్షల 10వేల రూపాయలను జీతం గా పొందుతున్నారు. సాధనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నెలకు 2 లక్షల 5వేల రూపాయలను జీతం గా పొందుతున్నారు. ఆదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక రూపాయి మాత్రమే తన జీతం గా తీసుకుంటున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి రెండున్నర లక్షలు జీతం ఉంది. కానీ ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో సీఎం జగన్ కేవలం ఒక రూపాయి మాత్రమే జీతం గా తీసుకుంటున్నారు.
Also Read: మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న శివాని రాజశేఖర్ .!