Advertisement
మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ ని నిర్మించారు. నాగార్జున ఆయన స్నేహితుడు నల్ల ప్రీతంరెడ్డి కూడా భాగస్వామి. చెరువు భూమిని ఆక్రమించి నిర్మాణం చేయడంతో హైడ్రా అధికారులు దీనిని కూల్చివేశారు. నిబంధనల ప్రకారమే కట్టానని నాగార్జున చెప్పారు. కూల్చివేతని ఆపాలని స్టే తెచ్చుకున్నారు స్టే వచ్చేలోనే కన్వెన్షన్ ని పూర్తిగా నేలమట్టం చేశారు. కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని ప్రభుత్వం అంటోంది. ఎన్ కన్వెన్షన్ ను తాకుతూ చెరువు నీళ్ళు ఉంటాయి.
Advertisement
ఆధారాలతో సహా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి కంప్లైంట్ చేయడంతో అన్ని వివరాలను పరిశీలించి అధికారులు కూల్చివేశారు. ఈ కన్వెన్షన్ పై చర్యలు తీసుకుని తుమ్మికుంట చెరువుని గుర్తించాలని 2014లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి మంత్రి కేటీఆర్ దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. పదేళ్ల నుంచి కేటీఆర్ మౌనంగా ఉండడానికి కారణం ఏంటని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.
Advertisement
Also read:
ఆ తర్వాత నాగర్జున మాజీ కోడలు సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారని. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ వివాదంలోకి సమంత కూడా లాగారని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ నాయకులు సెలబ్రిటీలు ఎవరిని వదిలిపెట్టలేదు అని ఆక్రమం అని తెలిస్తే కూల్చి వేస్తున్నారని నోటీసులు ఉండవని నేరుగా కూల్చి వేయడం జరుగుతుందని హైడ్రా కమీషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!