Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత అంటే తెలియని వారు ఉండరు. గత కొన్ని సంవత్సరాల నుంచి స్టార్ డం కాపాడుకుంటూనే అనేక సినిమాల్లో నటిస్తోంది సమంత. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఒక పాత్రను చేయడానికి భయపడ్డారని వెల్లడించారు. మరి ఆ విషయాలు ఏంటో చూద్దాం..
Advertisement
సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. గుణశేఖర్ దర్శకనిర్మాతగా ఉన్నాయి. ఈ చిత్రానికి దిల్ రాజ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారట. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత పలు సంచలన విషయాలు బయట పెట్టింది.. గుణశేఖర్ ఈ కథతో వచ్చి నన్ను కలిసినప్పుడు నేను చేయనని చెప్పాను. ఎందుకంటే లుక్ పరంగా పాత్ర స్వభావం పరంగా శకుంతలగా మెప్పించడం చాలా కష్టమైన విషయం. అందుకే నేను భయపడ్డాను అని కానీ, ఆ భయాన్ని దాటడం కోసం ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతోనే తర్వాత ఒప్పుకున్నానని తెలియజేసింది.
Advertisement
also read:రామ్ చరణ్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజల్…!
శాకుంతలంగా నన్ను నేను మలుచుకోవడానికి కొంత సమయం తీసుకున్నారని అన్నది. ఈ చిత్రంలో బాల భరతుడు పాత్రను అల్లు అర్హ పోషిస్తుంది. అర్హకు వారి పేరెంట్స్ మంచి తెలుగు నేర్పించారు. తాను పూర్తిగా స్పష్టమైన తెలుగులో మాట్లాడుతోంది. సెట్ లో ఎంతమంది ఉన్నప్పటికీ భయపడదు. డైలాగ్స్ చెప్తూ ఉంటుంది. తాను డైలాగ్స్ చెబుతుంటే నాకు ఇంకా క్యూట్ గా అనిపించిందని చెప్పుకొచ్చారు సమంత.
also read: డాక్టర్లు ఎందుకు అర్థం కాకుండా ప్రిస్క్రిప్షన్ ని రాస్తారు ? అలా రాయడానికి కారణం ఇదేనా ?