Advertisement
గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని హీరో నాగచైతన్య వివాహం చేసుకొని విడిపోయిన తర్వాత సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం విషయాలు బయటకు వస్తూ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వారు ఎందుకు విడిపోయారో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. దీంతో అనేక వార్తలు చలువలు పలువలుగా పుట్టుకొస్తున్నాయి. అయితే తాజాగా విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది సమంత.
Advertisement
READ ALSO : వివాహం జరిగే సమయంలో వధువరులు తెల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తారు?
వివాహ బంధంలో ఎంత నిజాయితీగా ఉన్న వర్కౌట్ కాలేదని శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వివాహ జీవితంలో తాను ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ తనపై అనవసరంగా నిందలు వేశారని సమంత పేర్కొంది. విడాకులు తీసుకున్న కొంతకాలానికి పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందని, ఖాళీగా ఉండలేక దానికి ఓకే చెప్పానని తెలిపింది. అయితే ఈ టైము లో ఐటెం సాంగ్స్ కరెక్ట్ కాదని, ఇంట్లో వాళ్ళు వారించిన తాను ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఇంట్లో బాధపడుతూ కూర్చోవాలని ఆ సాంగ్ చేశానని చెప్పుకొచ్చింది.
Advertisement
READ ALSO : కేవలం నందమూరి కుటంబంలోనే ఎందుకు ఇలా ? వరుస పెట్టి ప్రమాదల వెనక ఇంత కథ ఉందా ?
సామ్ వ్యక్తిగత జీవితంపై కూడా సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను పడిన ప్రతీసారి బలంగా నిలబడ్డానని, నన్ను వేలెత్తి చూపిస్తే గెలిచినట్టు కాదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నా తప్పు లేనప్పటికీ తనను చాలా మంది జడ్జి చేశారని, ఆయినప్పటికీ తాను ఎప్పుడు నిజాయితీగానే ఉంటూ ఎవరికి భయపడలేదని తెలిపింది. ఈ రెండేళ్ల జీవితం తనకు ఎంతో నేర్పిందని, ఇప్పుడు శారీరకంగా, మానసికంగా మరింత బలంగా ఉన్నానంది సమంత.
READ ALSO : టాలీవుడ్ లో 100 కోట్ల కలెక్షన్స్ మార్క్ సాధించిన హీరోలు ఎవరంటే ?