Advertisement
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా డిసెంబర్ 07, 2023న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సీఎం ప్రమాణ స్వీకారంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశాయి. అయితే కొండా సురేఖ ఎప్పుడైతే ప్రమాణం చేశారో ఆ తరువాత ఎల్బీ స్టేడియం అంతా మారుమ్రోగిపోయింది. ఎందుకంటే.. సీతక్క.. సీతక్క అని స్టేడియం దద్దరిల్లీ పోయింది. స్టేడియం దద్దరిల్లిన తరువాత వెంటనే అక్కడ సీఎస్ శాంతి కుమారి సీతక్కను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించింది. సీతక్క తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు స్టేజీ మీదికి రాగానే ఒక్కసారిగా ఎల్బీ స్టేడియం దద్దరిల్లిపోయింది.
Advertisement
ఎప్పుడైతే ములుగు ఎమ్మెల్యే సీతక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పోడియం దగ్గరికి వచ్చిందో ఇక జనాల అరుపు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎల్బీ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. స్టేడియంలో ఉన్న జనాలు మాత్తం ఒక్కసారిగా కేకలు పెట్టారు. సీతక్క పేరు పిలిచిన తర్వాత, సీతక్క వచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండగా జనాల అరుపులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సైతం షాక్ అయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఆశ్చర్యపోయారు. సీతక్కకు ఇంత క్రేజీ ఉందా ? అని షాక్ అవ్వడం గమనార్హం.
Seethakka 🔥🔥 pic.twitter.com/wA8cruiGdj
— Venkat Bhargav Paidipalli (@NBK_MB_cult) December 8, 2023
Advertisement
సీతక్క అనే నేను అని అనగానే మరోసారి జనాలు అరుపులతో గోల చేశారు. వాళ్ల కేకలను మాత్రం అస్సలు ఆపలేదు. సీతక్క ఇక చాలు ఆపండి అంటూ ప్రజలను చూస్తూ దండం పెట్టినా కూడా జనాలు ఆగలేదు. అనే నేను అంటూ గవర్నర్ మరోసారి సీతక్కతో ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పారు. అయినా కూడా జనాలు అరుపులు ఆపలేదు. దీంతో గవర్నర్ కు ఏం చేయాలో అర్థం కాక.. నవ్వుతూ ఉన్నారు. దాదాపు రెండు నిమిషాల వరకు జనాలు అరుపుల తరువాత దనసరి అనసూయ సీతక్క అనే నేను అంటూ.. తన ప్రమాణ స్వీకారాన్ని ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను నిర్వహిస్తానని ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. సీతక్క ప్రమాణ స్వీకారం అనంతరం సీతక్కతో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ, గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి కాసేపు మాట్లాడారు. అందరికీ సీతక్క ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డితో కలిసినప్పుడు కూడా జనాలు పెద్దగా అరిచారు. రేవంత్ రెడ్డి సీతక్క క్రేజీ చూసి తన భుజాలపై చేయి వేసి శభాష్ అనడంతో మరోసారి స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ఇక ఆ తర్వాత సోనియా గాంధీ అయితే లేచి నిలబడి మరీ తనను కౌగిలించుకొని ధన్యవాదాలు తెలిపారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.